ప్రస్తుత సమాజంలో బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే అధిక బరువు ( overweight )తగ్గడానికి మన ఇంటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
అందులో పుదీనా, దాల్చిన చెక్క, నిమ్మకాయ, అల్లం వేసి ఒక పానీయాన్ని తయారు చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుందని కూడా చెబుతున్నారు.ప్రస్తుత సమాజంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
మారిన జీవనశైలి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నప్పుడు వారికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టుగా పని చేస్తుంది.ఈ డ్రింక్ తాగితే తాగుతూ రోజు అరగంట వ్యాయామం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఒక గిన్నెలో గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక 15 తాజా పుదీనా ఆకులు, ఐదు లవంగాలు( cloves ), అంగుళం దాల్చిన చెక్క ముక్క, అర స్పూన్ అల్లం తురుము, ( Grate ginger )నాలుగు లేదా ఐదు నిమ్మకాయ ముక్కలు వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగిస్తే వాటిలోని పోషకాలు నీటిలోకి చేరుతాయి.ఆ తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసి ఆ పానీయం గురువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

ఇలా ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో పానీయాన్ని సేవించడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మలినాలు అన్ని తొలగిపోతాయి.అలాగే డిప్రెషన్, ( Depressionm )ఆందోళన,ఒత్తిడి వంటి మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.ఈ డ్రింక్ ప్రతి రోజు సేవించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక బరువును సులభంగా దూరం చేసుకోవచ్చు.