సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఈయన సినిమా వేడుకలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణం అవుతున్నాయి.
గతంలో పుష్ప2 సినిమా గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ పై పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.అప్పట్లో అల్లు అర్జున్ అభిమానులు ఈయన పై భారీ స్థాయిలో విమర్శలు చేశారు.
అదేవిధంగా రాబిన్ హుడ్ సినిమా వేడుకలో భాగంగా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు రావడంతో ఈయన చివరికి క్షమాపణలు కూడా చెప్పారు.ఇక తాజాగా రాజేంద్రప్రసాద్ షష్ఠి పూర్తి(sasti purti) చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.ఈ సినిమాకు ఇలయ రాజా(Ilayaraja) గారు సంగీతం అందించారు.
ఈ క్రమంలోనే ఈ వేడుకకు ఇళయరాజా హాజరు కావడంతో ఇళయరాజా గారితో తనకున్నటువంటి అనుబంధం గురించి రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

ఇళయరాజా మొదట తనకి సంగీతం అందించిన చిత్రం ప్రేమించు పెళ్లాడు.ఈ మూవీలో పాటలు బావున్నప్పటికీ సినిమా ఫ్లాప్ అయింది.దీనితో నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను.
ఈ సినిమా తర్వాత వెంటనే ఇళయరాజా గారితో నేను లేడీస్ టైలర్ (ladies tailor)సినిమాలో నటించాను.లేడీస్ ట్రైలర్ చిత్రం కనుక హిట్ కాకపోయినా ఉంటే నా ఫోటోకి ఇప్పటికే దండేసేవారు అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
లేడీస్ ట్రైలర్ సినిమా హిట్ కాకపోయి ఉంటే నేను చనిపోయి ఉండేవాడిని కానీ మీరందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేశారు అంటూ రాజేంద్రప్రసాద్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.