ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ను రోజు వాడితే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!

మన శరీరానికి అవసరం అయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్( Protein ) ఒకటి.బాడీ అనేది ప్రోటీన్ ను తయారు చేసుకోలేదు.

 How To Make Protein Powder At Home For Good Health!, Protein Powder, Good Health-TeluguStop.com

అందుకే రెగ్యులర్ గా మన బాడీకి ప్రోటీన్ ను అందించాలి.ఇటీవల రోజుల్లో మార్కెట్లో ఎన్నో రకాల ప్రోటీన్ పౌడర్స్ అందుబాటులోకి వచ్చాయి.

అయితే అవేమీ ఆరోగ్యానికి అంత మంచివి కాదు.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ప్రోటీన్‌ పౌడర్ ను రోజు వాడితే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.

ఎన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంతకీ ఆ ప్రోటీన్ పౌడర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం ప‌దండి.

Telugu Fitness, Tips, Homemadeprotein, Latest, Protein, Protein Powder-Telugu He

ముందుగా ఒక కప్పు బాదం( Almmonds ), ఒక కప్పు పిస్తా పప్పు, ఒక కప్పు జీడిపప్పు, అర కప్పు పుచ్చ గింజలు, అర కప్పు సోంపు, నాలుగు టేబుల్ స్పూన్లు గసగసాలు, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఆరు యాలకులు( Elachi ) తీసుకుని వేటి కవి వేయించి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పదార్థాలు అన్నిటినీ వేసుకోవాలి.అలాగే ఒక కప్పు డ్రై రోజ్ పెటల్స్ కూడా వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన ప్రోటీన్ పౌడర్ సిద్ధం అవుతుంది.

ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ప్రోటీన్ పౌడర్ ను రోజుకు రెండు టేబుల్ స్పూన్లు చొప్పున ప్రతి రోజు తీసుకోవాలి.

పాలతో కలిపి లేదా స్మూతీస్ ద్వారా.ఇలా ఏదో ఒక విధంగా తీసుకోవాలి.

దాంతో శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ లభిస్తుంది.వెయిట్ లాస్ ( Weight Loss )అవుతారు.

కొలెస్ట్రాల్ కరికి గుండెపోటు వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.మెదడు సూపర్ షార్ప్ గా పనిచేస్తుంది.

Telugu Fitness, Tips, Homemadeprotein, Latest, Protein, Protein Powder-Telugu He

అంతేకాదు, ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడ‌ర్( Homemade Protein Powder ) ను తీసుకోవ‌డం వ‌ల్ల‌ జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.వయసు పైబ‌డిన ఫిట్ గా, హెల్తీగా, ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం సైతం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.కాబట్టి మార్కెట్లో లభ్యమయ్యే ప్రోటీన్ పౌడర్స్ కాకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్పిన విధంగా ప్రోటీన్ పౌడర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube