కొందరి ముఖం ఎంతో తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంటుంది.కానీ మెడ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.
ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా అధికంగా కనిపిస్తుంటుంది.హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం, మృతకణాలు పేరుకుపోవడం, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.
దీంతో ముఖం ఎంత అందంగా ఉన్నా సరే ఏదో లోపం ఉన్నట్లు కనిపిస్తుంటుంది.
ఈ క్రమంలోనే మెడ నలుపు( Dark neck )ను వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మెడ ఎంత నల్లగా ఉన్నా సరే ఈ చిట్కా ను పాటిస్తే వారంలో తెల్లగా మారుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక అరటిపండు తొక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక బంగాళదుంప ( Potato )తీసుకుని తొక్క తొలగించి వాటర్ లో కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు తొక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఈ పదార్థాలను మిక్సీ జార్ లో వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు పచ్చి పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వేళ్ళతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.
ఆపై మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ చిట్కాను పాటిస్తే మెడ నలుపు చాలా వేగంగా మరియు సులభంగా వదిలిపోతుంది.
కొద్ది రోజుల్లోనే మళ్లీ మీ మెడ తెల్లగా కాంతివంతంగా మారుతుంది.