చుండ్రు( dandruff ).కోట్లాది మందిని సర్వసాధారణంగా కలవర పెట్టే సమస్యల్లో ఒకటి.
ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఖరీదైన షాంపూను వాడుతుంటారు.తోచిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.
అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే చుండ్రును ఎలా నివారించుకోవాలో తెలియక సతమతం అయిపోతుంటారు.అయితే ఇకపై వర్రీ వద్దు.
వారానికి ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే శాశ్వతంగా చుండ్రు సమస్యకు స్వస్తి పలకవచ్చు.ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక ఉల్లిపాయను( onion ) తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.అలాగే ఒక బంగాళదుంప( potato ) తీసుకుని పీల్ చెక్కి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.అలాగే చుండ్రు మళ్ళీ మళ్ళీ దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటుంది.చుండ్రు సమస్యను నివారించడానికి ఈ రెమెడీ చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
కాబట్టి ఎవరైతే చుండ్రు సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారో తప్పకుండా వానే ఈ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.