1.అయ్యప్ప భక్తులకు శుభవార్త
అయ్యప్ప భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ బీసీఏఎస్ శుభవార్త చెప్పింది.విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులు ఇక పై ఇరుముడిని క్యాబిన్ లగేజిలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది.
2.కేసీఆర్ అత్యవసర సమావేశం
ప్రగతి భవన్ లో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
3.ఏపీ ప్రభుత్వానికి హై కోర్ట్ షాక్
గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీనియర్ రెసిడెన్సీ పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
4.ప్రశాంతి నిలయం కు చేరుకున్న ఇస్రో చైర్మన్
సత్యసాయిబాబా 97వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రశాంతి నిలయం కు చేరుకున్నారు.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.నేడు స్వామి వారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
6.11మంది రెబల్ అభ్యర్థులపై బిజెపి సస్పెన్షన్ వేటు
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 11 మంది నేతలను బీజేపీ సస్పెండ్ చేసింది.
7.తీహార్ జైలుకు శరత్ చంద్ర రెడ్డి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ వెనక చంద్రారెడ్డి మద్యం వ్యాపారవేత్త వినయ్ బాబుకు అవెన్యూ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.వీరిద్దరిని తీహార్ జైలుకు పంపించారు.
8.ముగిసిన హైకోర్టు న్యాయవాదుల సమ్మె
జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీ వద్దంటూ ఢిల్లీలో సిజేఐ కి వినతి పరిశీలిస్తామని జస్టిస్ చంద్ర చూడ్ హామీ ఇచ్చారు.
9.అగ్రి వెటర్నరీ యూజీ కోర్సులకు కౌన్సిలింగ్
వ్యవసాయ వెటర్నరీ ఉద్యాన, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం తొలి విడత సంయుక్త కౌన్సిలింగ్ ను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ఎస్ సుధీర్ కుమార్ ప్రారంభించారు.
10.నేటి నుంచి బిఎస్సి నర్సింగ్ వెబ్ కౌన్సిలింగ్
బీఎస్సీ నర్సింగ్ , పిబి బిఎస్సి నర్సింగ్, బిపిటి సీట్ల భర్తీకి మంగళవారం నుంచి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
11.ఈడి ముందు కు మంత్రి తలసాని పీఏ
క్యాసినో కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) విచారణకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ హాజరయ్యారు.
12.రక్తహీనత వివరాల నమోదుకు ‘ఏ షీల్డ్ యాప్ ‘
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కిశోర బాలికలు, గర్భిణీలకు అనీమియా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.రక్తహీనత పరీక్షల వివరాల నమోదు కోసం వైద్య ఆరోగ్యశాఖ ఏ షీల్డ్ యాప్ ను రూపొందించింది.
13.తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్ వద్దు
విద్యుత్ సంస్థల్లో పదోన్నతులు పొందిన తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్ ఇస్తే ఆందోళనలు ఉదృతం చేస్తామని పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు ప్రకటించారు.
14.షర్మిల కామెంట్స్
బంగారు తెలంగాణ చేస్తానని అర చేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పలకుప్పుగా మార్చి బ్రష్టు పట్టించారని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
15.చేప పిల్లల పంపిణీ కాంగ్రెస్ స్కీమే
మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ పథకం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీమేనని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
16.ధరణి ని రద్దు చేయండి
తెలంగాణలో ధరణి వ్యవస్థను రద్దు చేయాలని కాంగ్రెస్ చేసింది కాంగ్రెస్ బృందం కోరింది.
17.రాహుల్ కామెంట్స్
గిరిజనులు దేశానికి తొలి యజమానులని వారి హక్కులను ఎందుకు బిజెపి పనిచేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
18.మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో నగదు సీజ్
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా భారీగా నగదు దొరికినట్టు సమాచారం.
19.టి.కాంగ్రెస్ కు మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,350
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,750
.