వెరోనిక విద్యా రెడ్డి సుధీకర్ రెడ్డి ల కూతురు.వెరోనిక తల్లి విద్యా రెడ్డి ప్రముఖ నిర్మాత అయిన సి సి రెడ్డి కుమార్తె.
వెరోనిక తండ్రి సుదికర్ రెడ్డి రాజారెడ్డి నాలుగో కుమారుడు రాజారెడ్డి ఎవరంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు సీఎం అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి.సుధీకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ల సొంత తమ్ముడు.
అంటే రాజశేఖర్ రెడ్డి వెరోనిక కి పెద్దనాన్న.వెరోనికాకి జగన్ అన్నయ్య అవుతాడు వెరోనికా మాట్లాడుతూ వాళ్ల పెదనాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి తన కూతురు అయిన షర్మిలని ఎలా అయితే చూసుకుంటాడు తనని కూడా అలాగే చూసుకుంటాడు అని చెప్పింది.
అయితే వెరోనిక అమెరికాలో ఉండేది అప్పుడప్పుడు వాళ్ళ తాత అయిన సి సి రెడ్డి గారిని చూడడానికి హైదరాబాద్ కి వచ్చేది అలా వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ లో మంచు విష్ణు ఆమెను చూడడం ఇష్టపడడం ఆ తర్వాత తను ప్రేమించిన విషయం వెరోనికకి చెప్పడం దాంతో ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది.అయితే వెరోనిక తల్లి అయిన విద్యా రెడ్డి వాళ్ళ తండ్రి సి రెడ్డి గారు ప్రముఖ నిర్మాత మరియు వ్యాపార వేత్త అలాగే వెరోనిక తండ్రి అయిన సుదికర్ రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి అన్నయ్య రాజశేఖర్ రెడ్డి రాజకీయ ఫ్యామిలీ కి చెందిన వారు అలా వెరోనిక తల్లి తరఫున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు ఉండడం తండ్రి తరపున పొలిటికల్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు.
కానీ తనకి సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ సినిమా హీరోగా మంచి గుర్తింపు పొందిన నటుడు విష్ణు నీ పెళ్లి చేసుకుంది.
ఒకప్పుడు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఒక చిన్న గ్రామంలో పుట్టి చెన్నై వెళ్లి అక్కడ అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి ఒక చిన్న అవకాశంతో తన లో ఉన్నటువంటి నటుణ్ని బయటికి తీసి అలా అంచెలంచలుగా పైకెదిగిన వ్యక్తి మోహన్ బాబు మొదట్లో విలన్ గా మంచి గుర్తింపు సాధించి మోహన్ బాబు ఆ తర్వాత కామెడీ విలన్ గా కూడా తనదైన ముద్రని ఇండస్ట్రీపై వేశాడు అలాంటి మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించాడు.ముఖ్యంగా రజనీకాంత్ కీలకపాత్రలో చేసిన పెదరాయుడు సినిమా లో మోహన్ బాబు నట విశ్వరూపాన్ని చూపించాడు అని చెప్పాలి.అలాగే సురేష్ కృష్ణ డైరెక్షన్ లో చేసిన రాయలసీమ రామన్న చౌదరి సినిమా లో లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో తనదైన మార్క్ చూపిస్తు గొప్ప నటనను చూపించాడు.
అయితే మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విష్ణు కూడా మొదట్లో విష్ణు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ నటుడిగా మంచి మార్కులే పడ్డాయి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన డి సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు ఆ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అవ్వడం తో ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు సాధించాడు.ఆ తర్వాత నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన దేనికైనా రెడీ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది.
వైవియస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సలీం సినిమాలో మోహన్ బాబుతో కలిసి నటించాడు విష్ణు.మోహన్ బాబు విష్ణు ఈ సినిమాలో పోటీపడి నటించాడు అని చెప్పొచ్చు.
సలీం సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ విష్ణుకి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి.బిందాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వీరుపోట్ల దర్శకత్వంలో దూసుకెళ్తా సినిమాలో నటించి నటన పరంగా తనను తాను ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేసుకున్నాడు.
ప్రస్తుతం విష్ణు మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు ఇందులో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.