తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు కానీ కొందరు మాత్రమే వల్ల అ హావభావాలతో, రూపురేఖలతో మనందరికీ బాగా గుర్తుండి పోతారు అలాంటి కమెడియన్ గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఒక నటుడు ఎవరు అంటే అది కళ్ళు చిదంబరం గారు.ఆయన కళ్ళు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆ సినిమాలోని నటనకి నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు అయితే మొదటి నుంచి కళ్ళు చిదంబరం గారికి నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తను పొద్దంతా జాబ్ చేస్తూ రాత్రి వేళల్లో నాటకాల్లో నటించేవారు చాలా రోజుల పాటు అలాగే చేయడంతో తన కళ్ళు అలా అయిపోయాయి అని ఆయన ఎప్పుడూ చెప్పుకొస్తూ ఉండేవారు కానీ ఆయన కళ్ళు అలా ఉండడం వల్లే సినిమాల్లో కమెడియన్ గా మంచి అవకాశాలు వచ్చాయి.
ఆయన తెలుగు సినిమాల్లో చేసిన కామెడీకి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఫలానా క్యారెక్టర్ ఉంది అంటే అది కళ్ళు చిదంబరం గారే చేయాలి అనేంతగా ఆయన నటనని చూపించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు.ఆయన తెలుగులో చాలా సినిమాల్లో నటించారు ముఖ్యంగా ఎస్.
వి కృష్ణారెడ్డి, ఇ.వి.వి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారి సినిమాల్లో ఎక్కువగా నటించారు.ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చేసుకుందాం సినిమా లో కూడా కళ్ళు చిదంబరం ఒక మంచి క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తనదైన కామెడీతో జనాలు అందరికీ చాలా దగ్గర అయిపోయాడు.అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు సినిమా లో మంచి క్యారెక్టర్ పోషించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు చివర్లో అయితే సౌందర్య రౌడీ చేతిలో ఇబ్బంది పడుతుంటే బొట్టు పెట్టమ్మా అనే డైలాగు చాలా ఫేమస్ అయిపోయింది.
ఆ ఒక్క సినిమాతో కళ్ళు చిదంబరం కొన్ని రోజులపాటు స్టార్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు.అయితే తను నటుడిగా నటిస్తూ సినిమాలో నాటకాల్లో వచ్చే డబ్బులతో పేద కళాకారులకు సహాయం చేసేవాడు తను మాత్రం తను చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన డబ్బు మాత్రమే తన జీవనానికి వాడుకొనేవాడని చెప్పేవాడు.అయితే ఆయన్ని ఇండస్ట్రీకి చెందిన చాలామంది చాలాసార్లు సన్మానించారు.ఇక కళ్ళు చిదంబరం చాలా మంది పేద కళాకారులకు కూడా తనకు తోచినంత సహాయం చేస్తారని చాలా మంది చెప్పుకుంటారు.
కళ్ళు చిదంబరం గారు 2015లో అనారోగ్యం కారణం వల్ల కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే ఆయనకి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.కళ్ళు చిదంబరం ఇండస్ట్రీలో అందరితో చాలా కలివిడిగా ఉండేవాడు అని ఎవరితో ఎప్పుడు గొడవలు పెట్టుకునే వాడు కాదని అసలు కాంట్రవర్సీ లోనే నిలిచే వాడు కాదని ఇప్పటికీ చాలా మంది అంటుంటారు.
అయితే కళ్ళు చిదంబరం చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఆయన కొడుకులు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు ఫ్యూచర్ లో వస్తే రావచ్చు ఏమో.ఇండస్ట్రీలో అప్పుడు చాలా మంది కామెడీ యాక్టర్స్ ఉన్నప్పటికీ తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ తో జనాల్ని నవ్విస్తూ ఉండేవారు కన్ను డిఫరెంట్ గా ఉండడమే అతనికి ప్లస్ అయిందని ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు.బ్రహ్మానందం లాంటి నటుడు కూడా అప్పట్లో కళ్ళు చిదంబరం తో కాంబినేషన్ సీన్స్ తీసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాడని ఆయన కూడా చెప్పుకొచ్చాడు.