ఫేస్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!

సాధారణంగా ఒక్కోసారి ముఖం చాలా డల్ గా మారిపోతూ ఉంటుంది.సరిగ్గా అటువంటి సమయంలోనే ఏదైనా ఫంక్షన్ లేదా ముఖ్యమైన మీటింగ్ ఉంటే ఇక వారి బాధ వర్ణనాతీతం.

 Follow These Tips For Glowing Skin! Glowing Skin, Simple Tips, Home Remedies, Sk-TeluguStop.com

డల్ స్కిన్ ను ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక వర్రీ అయిపోతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ను ట్రై చేస్తే క్షణాల్లో మీ ఫేస్ సూపర్ గ్లోయింగ్ గా మారడం పక్కా.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

టిప్ 1: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్( Oats powder ), రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ ( Lemon juice )మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు ( curd )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై చర్మాన్ని పది నిమిషాల పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీ చర్మాన్ని డీప్ గా క్లెన్సింగ్ చేస్తుంది.చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను మురికిని తొలగిస్తుంది.చర్మం కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

Telugu Tips, Tips Skin Skin, Latest, Simple Tips, Skin Care, Skin Care Tips-Telu

టిప్ 2: ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ( Tomato pure ), వన్ టేబుల్ స్పూన్ మజ్జిగ( buttermilk ), వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీని పాటించిన కూడా ఫేస్‌ సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది.డల్ నెస్ ఎగిరిపోతుంది.

Telugu Tips, Tips Skin Skin, Latest, Simple Tips, Skin Care, Skin Care Tips-Telu

టిప్ 3: చర్మాన్ని అందంగా ప్రకాశవంతంగా మెరిపించడంలో బొప్పాయి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి బాగా మర్దనా చేసుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసేసుకోవాలి.బొప్పాయి మరియు లెమన్ జ్యూస్ చర్మానికి కొత్త మెరుపును జోడిస్తాయి.స్కిన్ ప్రకాశవంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube