ఫేస్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!

సాధారణంగా ఒక్కోసారి ముఖం చాలా డల్ గా మారిపోతూ ఉంటుంది.సరిగ్గా అటువంటి సమయంలోనే ఏదైనా ఫంక్షన్ లేదా ముఖ్యమైన మీటింగ్ ఉంటే ఇక వారి బాధ వర్ణనాతీతం.

డల్ స్కిన్ ను ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక వర్రీ అయిపోతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ను ట్రై చేస్తే క్షణాల్లో మీ ఫేస్ సూపర్ గ్లోయింగ్ గా మారడం పక్కా.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.టిప్ 1: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్( Oats Powder ), రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ ( Lemon Juice )మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు ( Curd )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

ఆపై చర్మాన్ని పది నిమిషాల పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీ చర్మాన్ని డీప్ గా క్లెన్సింగ్ చేస్తుంది.చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను మురికిని తొలగిస్తుంది.

చర్మం కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది. """/" / టిప్ 2: ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ( Tomato Pure ), వన్ టేబుల్ స్పూన్ మజ్జిగ( Buttermilk ), వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీని పాటించిన కూడా ఫేస్‌ సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది.డల్ నెస్ ఎగిరిపోతుంది.

"""/" / టిప్ 3: చర్మాన్ని అందంగా ప్రకాశవంతంగా మెరిపించడంలో బొప్పాయి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి బాగా మర్దనా చేసుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసేసుకోవాలి.

బొప్పాయి మరియు లెమన్ జ్యూస్ చర్మానికి కొత్త మెరుపును జోడిస్తాయి.స్కిన్ ప్రకాశవంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.

డాకు మహారాజ్ మూవీలో తన నటనతో మెప్పించిన ఈ చిన్నారి ఎవరో మీకు తెలుసా?