ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మనమందరం ఆరోగ్యకరమైన మరియు రిఫ్రెషింగ్‌గా ఏదైనా తీసుకోవాలని భావిస్తాము.ఇందులో భాగంగానే కొందరు టీ, కాఫీలతో( tea and coffee ) రోజును ప్రారంభిస్తే.
మరికొందరు ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధతో ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు.ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలతో నిండి ఉంటుంది.
ఫ్రూట్ జ్యూస్ డేను హెల్తీగా స్టార్ట్ చేయడానికి సహాయపడుతుందని మరియు శరీరానికి ఇంధనాన్ని అందిస్తుందని అనుకుంటారు.
కానీ ఖాళీ పొట్టతో ఫ్రూట్ జ్యూసులు( Fruit juices ) తాగడం అనేది చెత్త అలవాటుగా నిపుణులు పరిగణిస్తున్నారు.
ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కన్నా హానే ఎక్కువ జరుగుతుందని అంటున్నారు.సాధారణంగా పండ్లలో ఫైబర్ ఉంటుంది.ఇది చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది.దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కానీ పండ్ల రసాల్లో ఫైబర్ ( fiber )అనేది ఉండదు.కాబట్టి ఖాళీ పొట్టతో ఫ్రూట్ జ్యూసులు తాగితే.
అందులో అధిక మొత్తంలో ఉండే చక్కెర బ్లెడ్ షుగర్ లెవల్స్ ను అమాంతం పెంచేస్తుంది.ఇది మధుమేహానికి దారి తీస్తుంది.

అలాగే ఖాళీ పొట్టతో ఫ్రూట్ జ్యూసులు తీసుకుంటే.శరీరంలో ఫ్రక్టోజ్ మోతాదు పెరిగి కాలేయం మరియు ప్యాంక్రియాస్‌పై అధిక భారం పడుతుంది.వారి పనితీరు నెమ్మదిస్తుంది.నారింజ, టాన్జేరిన్( Orange, tangerine ) మరియు ద్రాక్ష వంటి సిట్రస్ పండ్ల రసాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం ఇంకా ప్రమాదకరం.
సిట్రస్ ఫ్రూట్స్ జ్యూసులు కడుపులో చికాకును కలిగిస్తాయి.పొట్టలో పుండ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

అంతేకాకుండా ఉదయాన్నే ఖాళీ పొట్టతో ఫ్రూట్ జ్యూసులు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి.దీని కారణంగా తీవ్ర అలసటకు గురవుతారు.అధిక దాహం, విపరీతంగా ఆకలి వేయడం వంటివి కూడా జరుగుతాయి.కాబట్టి, ఇకపై ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకోకండి.కావాలి అనుకుంటే మీరు నేరుగా ఫ్రూట్స్ ను తినొచ్చు.