డెలివరీ తర్వాత ఆడవారు అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో హెయిర్ ఫాల్( Hair fall ) ఒకటి.ప్రెగ్నెన్సీకి ముందు కొంతమంది జుట్టు చాలా ఒత్తుగా పొడుగ్గా ఉంటుంది.
కానీ పిల్లలు పుట్టిన తర్వాత తోకలా తయారవుతుంది.ప్రసవం అనంతరం అధిక హెయిర్ ఫాల్ కారణంగా ఆడవారు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ స్ప్రే ను కనుక వాడితే హెయిర్ ఫాల్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంతకీ ఆ హెయిర్ స్ప్రే ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక రెండు స్పూన్లు డ్రై రోజ్ మేరీ ఆకులు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), నాలుగు ఎండిన మందార పువ్వులు, వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి గరిటెతో తిప్పుకుంటూ ఉడికించాలి.దాదాపు వాటర్ సగం అయ్యేంత వరకు ఉడికించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

స్ట్రైనర్ సహాయంతో ఉడికించిన పదార్థాల నుంచి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరు వెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి మిక్స్ చేస్తే మన హెయిర్ స్ప్రే అనేది సిద్ధమవుతుంది.ఒక స్ప్రే బాటిల్లో తయారు చేసుకున్న వాటర్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
డెలివరీ తర్వాత వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ హెయిర్ స్ప్రే ను కనుక వాడితే జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.
కురులు ఒత్తుగా బలంగా మారతాయి.చుండ్రు సమస్య( Dandruff ) ఉంటే తగ్గు ముఖం పడుతుంది.
కాబట్టి ప్రసవం అనంతరం అధికంగా జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ స్ప్రేను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.