తెలుగు సినిమా ఇండస్ట్రీ లో శ్రీదేవి కి మాత్రమే దక్కిన అరుదైన ఘనత ఇదే !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు, వెళ్లిపోయారు.వారిలో కొందరు మాత్రం తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు.

 Record Of Heroine Sridevi Details, Sridevi,sridevi Record, Heroine Sridevi, Srid-TeluguStop.com

అలాంటి వారిలో ముందుగా అంజలీదేవి, సావిత్రి, వాణిశ్రీ, భానుమతి, సౌందర్య ముందు వరుసలో నిలుస్తుంటారు.ముఖ్యంగా శ్రీదేవి( Sridevi ) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఆమె కూడా గొప్ప నటీమణులల్లో టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది.ఈ అందాల తార తెలుగు, తమిళం మలయాళం కన్నడ భాషలతో పాటు ఇతర భారతీయ భాషల్లో మొత్తం 300 సినిమాలు చేసి మెప్పించింది.

ఈ సినిమాల్లో ఎక్కువ శాతం ఆమె హీరోయిన్‌గానే నటించింది.ఆమె లాగా వందల సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నటీమణులు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.

Telugu Chiranjeevi, Sridevi, Krishna, Nagarjuna, Shoban Babu, Sridevi Cos, Sride

తెలుగు ప్రేక్షకుల్లో శ్రీదేవి అంటే చాలా గౌరవం కూడా ఉంటుంది.అందుకు ఓ కారణం ఉంది.ఈ ముద్దుగుమ్మ మొదట్లో ఎన్టీఆర్‌,( NTR ) ఎఎన్నార్‌, ( ANR ) కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో జత కట్టింది.వీరితో రొమాన్స్ చేయడమే కాకుండా ఈ హీరోలు నటించిన ఎన్నో సినిమాల్లో మనవరాలిగా, కూతురుగా నటించి మెప్పించింది.

టాలీవుడ్ సెకండ్ జనరేషన్ హీరోలైన చిరంజీవి,( Chiranjeevi ) నాగార్జున,( Nagarjuna ) వెంకటేష్‌ వంటి హీరోలతో కూడా రొమాన్స్ చేసింది.ఇవన్నీ సూపర్‌హిట్‌! సెకండ్ జనరేషన్ టాప్‌ హీరోల్లో ఒక్క బాలకృష్ణతో తప్ప ఈ ముద్దుగుమ్మ అందరితో కలిసి నటించింది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా శివాజీ గణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి హీరోలతో కలిసి నటించింది.శ్రీదేవి, కమల్‌హాసన్‌ కలిసి చాలా ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.

ఏ హీరో హీరోయిన్ పెయిర్ ఇల్లు కలిసి చేసినన్ని సినిమాలు చేయలేదు.

Telugu Chiranjeevi, Sridevi, Krishna, Nagarjuna, Shoban Babu, Sridevi Cos, Sride

బాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరితోనూ శ్రీదేవి జత కట్టింది.రాజేష్‌ ఖన్నా, ధర్మేంద్ర, మిథున్‌ చక్రవర్తి, అనిల్‌ కపూర్‌, సన్నిడియోల్‌, రిషి కపూర్‌, జితేంద్ర వంటి హిందీ హీరోలతో జతకట్టి అక్కడ కూడా అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది.జితేంద్ర, శ్రీదేవి కాంబోలో ఎక్కువ హిందీ సినిమాలు వచ్చాయి.

తెలుగులో సూపర్‌హిట్‌ అయిన సినిమాలను హిందీలో జితేంద్ర, శ్రీదేవి కలిసి చేశారు.

శ్రీదేవి బాలనటిగా కూడా యాక్ట్ చేసింది.

దాదాపు 50 ఏళ్ల పాటు నటిగా శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలో రాణించింది.టాప్‌ హీరోయిన్‌గా 20 ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది.ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా ఎప్పుడూ ఎవరితోనో శ్రీదేవి గొడవ పెట్టుకోలేదు.1996లో బాలీవుడ్‌ ప్రొడ్యూస్‌ బోనీ కపూర్‌ను( Boney Kapoor ) శ్రీదేవి పెళ్లాడింది.అనుకోకుండా అర్ధాంతరంగా చనిపోయి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube