ఈ హోమ్ మేడ్ ఫేస్ టోనర్ ను వాడితే స్కిన్ వైట్ గా బ్రైట్ గా మరియు టైట్ గా మారుతుంది!

ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మరియు బిగుతుగా ఉంటే చూపులకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు.అందుకే అటువంటి చర్మాన్ని పొందడం కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆరాటపడుతుంటారు.

 Using This Homemade Face Toner Will Make Your Skin Whiter, Brighter And Tighter!-TeluguStop.com

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ టోనర్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ఈ టోనర్ ను తరచూ వాడితే మీ స్కిన్ వైట్ గా, బ్రైట్ గా మరియు టైట్ గా మారడం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకోవాలి.

అలాగే ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోసి బాగా మిక్స్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు రైస్ వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రైస్ వాటర్ ను వేసుకోవాలి.ఈ వాటర్ కాస్త హీట్ అవ్వగానే నాలుగు లవంగాలు, కొన్ని ఎండిన గులాబీ రేకులు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేస్తే మన ఫేస్ టోనర్ సిద్ధమవుతుంది.ఈ టోనర్ ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు, నైట్ నిద్రించడానికి ముందు తయారు చేసుకున్న టోనర్ ను దూది సహాయంతో ముఖ చర్మానికి అప్లై చేసుకోవాలి.

ఈ ఫేస్ టోనర్ ను రోజుకు రెండు సార్లు కనుక వాడితే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.ముడతలు ఉంటే మాయమై చర్మం టైట్ గా మారుతుంది.నిత్యం స్కిన్ బ్రైట్ గా మెరుస్తుంది.మ‌రియు ఈ హోమ్ మేడ్ ఫేస్ టోనర్ ను వాడటం వల్ల పిగ్మెంటేషన్ సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube