చుండ్రును నివారించి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ హెయిర్ మాస్క్ ఇదే!

ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని మ‌ద‌న పెట్టే స‌మ‌స్య‌ల్లో చుండ్రు ఒక‌టి.ఈ చుండ్రు వ‌ల్ల త‌ల‌లో తీవ్ర‌మైన దుర‌ద‌, చికాకు, జుట్టు అధికంగా ఊడ‌టం, జుట్టు డ్రై అవ్వ‌డం వంటి ర‌క‌ర‌కాల స‌మ‌స్యలు స‌త‌మ‌తం చేస్తుంటాయి.

 This Is A Simple Hair Mask That Prevents Dandruff And Makes Hair Thicker , Dandr-TeluguStop.com

అందుకే చుండ్రును వ‌దిలించుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.అయితే టెన్ష‌న్ వ‌ద్దు.

ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ హెయిర్ మాస్క్‌ను ట్రై చేస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా మాయం అవ్వాల్సిందే.మ‌రి ఇంత‌కీ ఆ హెయిర్ మాస్క్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలో ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని తొక్క తోల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్క‌ను తీసుకుని పీల్ తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం ముక్క‌లు వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

Telugu Tips, Dandruff, Care, Care Tips, Latest, Thick-Telugu Health Tips

ఇప్పుడు ఒక ప‌ల్చ‌టి వ‌స్త్రంలో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని.అందులో ఉండే వాట‌ర్‌ను తొల‌గించాలి.ఈ పెరుగులో మూడు టేబుల్ స్పూన్ల ఉల్లి-అల్లం జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం, వ‌న్ ఎగ్ వైట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌తో పాటు జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించాలి.

ఆపై ష‌వ‌ర్ క్యాప్ ధ‌రించాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్‌ను వేసుకుంటే చుండ్రు దూరం అవ్వ‌డ‌మే కాదు జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా కూడా పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube