ఉద్యోగం చేసే గ‌ర్భిణీలు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే!

ప్రెగ్నెన్సీ అనేది పెళ్లైన ప్ర‌తి మ‌హిళా ఒక వ‌రంలా భావిస్తుంది.ఆ స‌మ‌యంలో క‌డుపులోని శిశువు ఆరోగ్యంగా ఉండాల‌ని ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

 Pregnant Women Who Do The Job Definitely Take These Tips! Pregnant Women, Pregna-TeluguStop.com

అనేక ఆహార నియ‌మాల‌ను పాటిస్తారు.అయితే కొంద‌రు ప‌లు కార‌ణాల వ‌ల్ల ప్రెగ్నెన్సీ స‌మ‌యంలోనూ ఉద్యోగం చేస్తుంటారు.

ఉద్యోగం చేయడం ఏమీ త‌ప్పు కాదు.కానీ, అలాంటి వారు ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో లేట్ చేయ‌కుండా చూసేయండి.

సాధార‌ణంగా కొన్ని ఉద్యోగాల్లో రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చొని పని చేయాల్సి ఉంటుంది.

అయితే గ‌ర్భిణీలు గంట‌లు త‌ర‌బ‌డి కూర్చోవ‌డం, గంట‌లు త‌ర‌బ‌డి నిల్చువ‌డం ఏ మాత్రం మంచిది కాదు.పైగా ఒకే చోట‌ ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ కూడా సరిగా అందకపోవచ్చు.

కాబ‌ట్టి, అటూ ఇటూ తిరుగుతూ, నిలబడుతూ, కూర్చుంటూ, విరామం తీసుకుంటూ ఉండాలి.మ‌రియు కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమను స్ట్రైట్‌గా ఉండేలా చూసుకోవాలి.త‌ద్వారా క‌డుపుపై భారం ప‌డ‌కుండా ఉంటుంది.

Telugu Tips, Latest, Pregnant-Telugu Health

అలాగే కంప్యూట‌ర్ల ముందు కూర్చునే స‌మ‌యంలో పాదాల‌ను నేల‌పై కాకుండా కాస్త ఎత్తులో పెట్టుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల పాదాలు వాపు రాకుండా ఉంటాయి.కొంద‌రు ప‌నిలో ప‌డి టైమ్‌కు తిన‌డం మ‌ర‌చిపోతుంటారు.

కానీ, ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎంత ప‌ని ఉన్నా టైమ్‌కు ఫుడ్ తీసుకోవాలి.మ‌రో విష‌యం ఏంటంటే.

ఏ ఆహారం తీసుకున్నా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి.

Telugu Tips, Latest, Pregnant-Telugu Health

ఉద్యోగం చేసే గ‌ర్భిణీ స్త్రీలు బ‌య‌ట ఫుడ్‌ను అస్స‌లు తీసుకోరాదు.బ‌య‌ట త‌యారు చేసే ఆహారాలు త‌ల్లి ఆరోగ్యానికే కాదు క‌డుపులోని శిశువు ఆరోగ్యానికీ ఏ మాత్రం మంచిది కావు.అదేవిధంగా, ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాట‌ర్‌తో పాటు కొబ్బ‌రి నీరు, పండ్ల ర‌సాలు, మ‌జ్జిగ వంటివి కూడా త‌ర‌చూ తీసుకోవాలి.

ధూమపానం, మ‌ద్య‌పానం వంటి అల‌వాట్లు ఉంటే మానుకోవాలి.ప్ర‌తి రోజు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి.కంటి నిండా నిద్ర‌పోవాలి.మ‌రియు వైద్యులు సూచించే మందులు వేసుకోవ‌డం మ‌ర‌వ‌రాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube