ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ( Gautham Adani ) పై అమెరికాలో కేసు నమోదు అయిందని , ఆదానితో పాటు, దాని అనుబంధ సంస్థల ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఇవ్వచూపారు అనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదు అయినట్టు వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ కు చెందిన గ్రీన్ ఎనర్జీ ఈరోజు స్పందించింది.ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని , ఆయన సమీప బంధువు సాగర్ ఆదాని , సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ ( Senior Executive Vineet Jain )ల పై లంచం ఆరోపణలపై కేసు నమోదు చేశారనే విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని అదానీ గ్రూప్ ప్రకటించింది.
ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్ లో గ్రీన్ ఎనర్జీ ( Green Energy in Stock Exchange Filing )క్లారిటీ ఇచ్చింది. అదానీ పై ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ కింద అవినీతి , లంచం తదితరు కేసులు నమోదైనట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అవన్నీ పూర్తి నిరాదరమైనవని ఆదాని గ్రూప్ పేర్కొంది. గౌతమ్ ఆదాని, సాగర్ ఆదాని, వినీత్ జైన్ లపై సెక్యూరిటీస్ కు సంబంధించి మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప , లంచం , అవినీతి కేసుల్లో కాదని ఆదాని గ్రూప్ క్లారిటీ ఇచ్చింది.ఎఫ్ సి పి ఏ చట్టం ఉల్లంఘించారంటూ అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో వీరి ప్రస్తావన లేదని అదానీ గ్రూప్ ప్రకటించింది.
గత వైసిపి( YCP ) ప్రభుత్వ హయాంలో సోలార్ పవర్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అదానీ సంస్థ దాదాపు 2000 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.దీనిపైనే ఆదాని గ్రూప్ స్పందించింది. అమెరికాలోని ఫారిన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ ను గౌతం ఆదాని ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలు నిజం కాదు అని ఆదాని గ్రీన్ ఎనర్జీ పేర్కొంది .ఆదాని గ్రూప్ డైరెక్టర్ల పై మూడు నేరాభియోగాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది.ఇదిలా ఉంటే .గౌతమ్ అదానీ లంచం ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువ తగ్గుముఖం పట్టాయి.