Shani Influence On Children: చిన్నపిల్లలపై శని ప్రభావం ఎప్పటికీ ఉండదా..

భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో శని ప్రభావం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటాడు.భూమి ఉన్న ప్రతి వ్యక్తి జాతకం ప్రకారం ఆ వ్యక్తి చేసే మంచి చెడు పనుల ప్రభావం ముళ్ల శని దేవుడి దృష్టి వారిపై పడి కొందరికి అష్టైశ్వర్యాలు వస్తే మరి కొంతమందికి ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతాయి.

 Shani Influence On Children Will Never Be There Details, Shani Influence On Chil-TeluguStop.com

పిల్లలపై శని దేవుడు దృష్టి పడకుండా ఉండడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.దీనికి సంబంధించిన కథ ఒకటి పురాణాలలో ఉంది.

కౌశిక మహర్షికి పిప్పలాదుడు అనే కుమారుడు ఉండేవాడు.అయితే కౌశిక మహర్షి తన కుమారుడిని పోషించలేక ఒకరోజు తన కుమారుడిని అడవిలో వదిలేసి ఇంటికి వస్తాడు.

తల్లిదండ్రులకు దూరమైన అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన ఆ పిల్లాడు ఒక రావి చెట్టు నీడలో జీవిస్తూ ఉంటాడు.దానితో ఆ చిన్న పిల్లవాడికి పిప్పలాదుడు అనే పేరు కూడా వచ్చింది.

అడవిలో ఉన్న పిప్పలాదుడిని చూసి జాలిపడిన నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తూ ఆ నామమే నీ జీవితానికి వెలుగునిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.ఇక అయితే ఆ తర్వాత నుండి పిప్పలాదుడు ఎల్లప్పుడూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఒక మహర్షి లాగా మారిపోతాడు.

Telugu Bad Luck, Bakti, Devotional, Dudu, Pippaladudu, Puranas, Shani Influence-

ఇలా చేస్తున్నా తిప్ప పిప్పలాదుడిని చూసి అభినందించేందుకు వచ్చినా నారదుడిని పిప్పలాదుడు ఇలా ప్రశ్నిస్తాడు.బాల్యంలో తను కష్టాలు పడడానికి కారణం ఏంటి అని అడుగుతాడు.అప్పుడు నానదుడు సమాధానం చెబుతూ శని ప్రభావం వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందని చెబుతాడు.వెంటనే పిప్పలాదుడు తన తపోబలంతో గ్రహం మండలం నుండి ఈ శనిని కిందికి లాగి బాల్యంలో ఎవరిని వేధించవద్దని హెచ్చరిస్తాడు.

అప్పుడు దేవతలు అందరూ అక్కడకు వచ్చి ఈ పిప్పలాదుడికి నచ్చజెప్పడంతో శాంతించిన పిప్పిలాదుడు తిరిగి శనిని గ్రహ మండలంలోకి వెళ్ళనిస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube