ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా డబ్బుతోనే ఏ పని అయినా జరుగుతోంది.డబ్బు ఉంటే ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు.
అయితే డబ్బుతోనే ప్రపంచం నడుస్తుంది.ఏది కావాలన్నా కూడా, ఏం చేయాలన్న కూడా, దానికి మూల కారణం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధనవంతులుగా( rich ) మారి ఈ ప్రపంచంలో ఆనందంగా జీవించాలని అనుకుంటారు.కానీ ఎంత కష్టపడినప్పటికీ కూడా చేతిలో డబ్బులు నిలవడం కష్టంగా మారిపోయింది.
ఈ మధ్యకాలంలో ఉన్న రేట్లు వలన రాత్రి,పగలు శ్రమించి ఎంత ధనాన్ని సంపాదించినా కూడా డబ్బు నిలవడం కష్టంగా ఉంది.అయితే ఈ డబ్బును పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు.

అలాగే సరైన ప్లాన్ తో డబ్బు సేవ్ చేసుకున్న ధనవంతులు అవ్వవచ్చు.అయితే ధనవంతులుగా ఎదగాలంటే అదృష్టం కూడా కలిసి రావాలని చాలామంది అంటారు.కానీ అది మన చేతుల్లోనే ఉందని చాలామందికి తెలియదు.మనీ మేనేజ్మెంట్ ( Money Management )గురించి సరిగ్గా తెలుసుకుంటే ధనవంతులుగా మారవచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ధనవంతులుగా మారాలనుకుంటే చేయాల్సిన మొట్టమొదటి పని వృధా ఖర్చులు తగ్గించడం.
డబ్బు ఉంది కదా అని చాలామంది వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు.తినే విషయంలో, నెలవారి బడ్జెట్ ఉపయోగించే వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇలా తీసుకుంటే డబ్బులు( money ) వృధా అవ్వకుండా ధనవంతులు అవ్వవచ్చు.చాలావరకు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ పేమెంట్స్, లావాదేవీలు జరుగుతున్నాయి.ఆన్లైన్లో లావాదేవీలు చేస్తే మీకు డబ్బు ఖర్చు గురించి పెద్దగా ఆసక్తి ఉండదు.కాబట్టి నగదు చెల్లింపులు చేస్తే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.నగదు చెల్లింపు చేయడం వలన కచ్చితంగా ఖర్చు చేసే ముందు ఆలోచిస్తారు.ఇక సంపాదించిన డబ్బు అంతా వచ్చినట్లు ఖర్చు చేస్తూ ఉంటే ఆదాయం ఏమీ ఉండదు.
కాబట్టి ప్రతి నెల కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని దాన్ని మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.కాబట్టి ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఎన్నో రకాల ఇన్వెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి.
వాటిని ఉపయోగించుకుంటే ఈజీగా ధనవంతులు అవ్వవచ్చు.