తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జనవరి 20, బుధవారం,2021
ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.39
సూర్యాస్తమయం: సాయంత్రం 05.57
రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు
అమృత ఘడియలు: ఉ.06.50 నుంచి 07.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.56 నుంచి 12.41 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు వున్నాయి.మీ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రతలు తీసుకోవాలి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
తొందరపడి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరులకు చెప్పకూడదు.ఈ రోజు పనులు వాయిదా పడుతాయి.
వృషభం:

ఈ రోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.
మిథునం:

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులతో ఇబ్బందులెదురవుతాయి.ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.
సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడంవల్ల ఆర్థిక సమస్య కొంతవరకు అనుకూలంగా ఉంటుంది.తీరిక లేని సమయంతో గడుపుతారు.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.
కన్య:

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందుతారు.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.పాత స్నేహితులను కలుస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
తులా:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏదైనా పనిని మొదలు పెడితే ముఖ్యంగా తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా లాభాలు అందుకుంటారు.గృహ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు వ్యాపారస్తులు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
ధనస్సు:

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వం కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీరు కాలక్షేపం కోసం మీ స్నేహితులను కలుస్తారు.
మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నచో దీని గురించి చింత చెందాల్సిన అవసరం లేదు.తీరికలేని సమయం గడపడం వల్ల కాస్త విశ్రాంతి దొరుకుతుంది.మీఇంటికి బంధువులు వస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.సమయం గడుస్తున్న కొద్దీ జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను అందుకుంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్థులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.
మీనం:

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందడం వల్ల భవిష్యత్తులో లాభాలను అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి కలుగుతుంది.