ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్న దాదాపు చాలామంది ప్రజలు ఎన్నో రకాల ఆచారాలను, సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు.కానీ కొంతమంది ప్రజలు మాత్రం ఇలాంటి సంప్రదాయాలను ఆచారాలను అసలు నమ్మరు.
ఇంకా చెప్పాలంటే అబ్బాయిలు, అమ్మాయిల ఎడమ కాలికి ఒక నల్ల దారాన్ని( Black Thread ) కట్టి దిష్టి తగలకుండా కడితే దిష్టి తగలకుండా ఉంటుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.అసలు ఎడమ కాలికి( Left Leg ) నల్ల దారం కట్టుకుంటే ఖచ్చితంగా దిష్టి తగలదా అనే సందేహం చాలా మందిలో ఉంది.
ఈ నల్ల దారం కట్టుకుంటే ఉండే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే నల్ల రంగు అనగానే అదేదో అశుభంగా చాలా మంది ప్రజలు భావిస్తారు.కానీ నిజానికి నలుపు అనేది ప్రొటెక్టివ్ రంగు అని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే కాలికి నల్ల దారం కట్టుకుంటే దుష్టశక్తుల కళ్ళు( Evil Eye ) మనపై పడవు అని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే కొందరి కళ్ళు మంచివి కాదు అని కూడా పెద్దవారు చెబుతూ ఉంటారు.వారి నుంచి మనల్ని ఆ నల్ల దారం రక్షిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అంతేకాకుండా నల్లదారం కట్టుకుంటే శని దేవుడి కృప మన పై ఎప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.
అంతే కాకుండా శని అనగానే అదేదో దరిద్రం మాత్రం అనుకోకండి.మనకు తెలియకుండానే శని దేవుడు( Shani Dev ) మనకు మంచి కూడా చేస్తూ ఉంటాడు.ఇంకా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్ గా మార్చే శక్తి ఈ నల్ల దారానికి ఉందని పండితులు చెబుతున్నారు.
ఈ దారం కట్టుకున్న వారికి విజయం, మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే నల్ల దారం కట్టుకునే వారిలో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.