మహబూబ్ నగర్ లో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఐటీ ఉద్యోగుల కోసమే జాబ్ మేళా అన్న ఆయన మొదటి దశలో 650 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
త్వరలోనే అమర్ రాజా కంపెనీ ప్రారంభం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.అదేవిధంగా మెట్రో రైలు షాద్ నగర్ వరకు వస్తోందన్న ఆయన భవిష్యత్ లో మహబూబ్ నగర్ ఐటీ టవర్ వరకు వస్తుందని స్పష్టం చేశారు.