ధనం మూలం ఇదం జగత్ అని అంటారు.ధనం లేనిది ఎవరు కూడా జీవించలేరు.
డబ్బే ప్రపంచాన్ని శాసిస్తుంది అని అంటారు.నిద్రలేచింది మొదలు పడుకునే వరకు డబ్బు ఎలా సంపాదించాలో అని అందరు ఆలోచిస్తూ ఉంటారు.
అయితే వ్యాపారం, ఉద్యోగం, రోజువారి పనులు ఇలా ఏదో ఒకటి చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు.డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని పొదుపు చేసుకోవడం కూడా మరో ఎత్తు.
సంపద విషయంలో జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం కీలక పాత్ర పోషిస్తాయి.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం కొన్ని రాశులలో కొన్నింటి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.
సంపదకు ఆది దేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు.అమ్మవారి కటాక్షం కోసం లక్ష్మీదేవిని( Goddess Lakshmi ) సంతోష పరిచేందుకు పూజలు కూడా నిర్వహిస్తారు.
అయితే లక్ష్మీదేవికి కొన్ని రాశులు అంటే ప్రీతికరమైనవి.ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి
: ఈ రాశి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
వృషభ రాశి జాతకులు నిజాయితీ, దయగల స్వభావం కలిగి ఉంటుంది.ఏదైనా కార్యం తల పెడితే వీరికి అదృష్టం కూడా పూర్తవుతుంది.
ప్రతి పనిలో కూడా విజయం వీరిదే ఉంటుంది.ఆదాయం పంచుకునే మార్గాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
కర్కాటక రాశి
: కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి విశేషమైన ఆశీస్సులు ఉంటాయి.ఈ రాశి జాతకులు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉన్నవాళ్లు.
కాబట్టి వీరు ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.వీరు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.

సింహరాశి:
సింహరాశి జాతుకులకు లక్ష్మీదేవి చల్లని చూపు ఎప్పుడూ ఉంటుంది.అలాగే ఆర్థిక పరంగా ఇలాంటి ఇబ్బందులు ఈ రాశి జాతకులు ఎదుర్కోరు.లక్ష్మీదేవి అనుగ్రహం, అదృష్టం రెండూ కలిసి ఉండడం వలన వీరు చేపట్టిన ఏ పని అయినా సంపూర్ణ విజయం సాధిస్తారు.ఎంతటి కష్టమైనా భరించే కృషితో తలపెట్టిన కార్యం పూర్తి చేస్తారు.వీరికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు.
వృశ్చిక రాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి( Scorpio ) వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి.ఈ రాశి వ్యక్తులు ఆర్థికంగా బలంగా ఉంటారు.లక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు అదృష్టవంతులుగా పేరు పొందుతారు.
జీవితంలో అన్నీ ఆనందాలను అనుభవించగలుగుతారు.అలాగే ఆదాయం కూడా మెండుగా ఉంటుంది.