అతి ఆక‌లిని త‌గ్గించి అధిక బ‌రువును దూరం చేసే సూప‌ర్ స్మూతీ మీకోసం!

అధిక బ‌రువుకు అతి ఆక‌లి కూడా ఒక కార‌ణం.అతి ఆక‌లి వ‌ల్ల ఎప్పుడు ప‌డితే అప్పుడు దేన్ని ప‌డితే దాన్ని పొట్ట‌లోకి తోసేస్తుంటారు.

 A Super Smoothie That Reduces Extreme Hunger And Removes Excess Weight Is For Yo-TeluguStop.com

దాంతో క్యాల‌రీలు పెరిగి శ‌రీర బ‌రువు అదుపు త‌ప్పుతుంటుంది.శ‌రీర బ‌రువు అదుపు త‌ప్పిందంటే గుండె పోటు, మ‌ధుమేహం, అధిక ర‌క్త‌పోటు వంటి ర‌క‌ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముట్టేస్తుంటాయి.

అందుకే బ‌రువును అదుపులో ఉంచుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తుంటారు.బ‌రువు అదుపులో ఉండాలంటే అతి ఆక‌లి త‌గ్గాలి.

 A Super Smoothie That Reduces Extreme Hunger And Removes Excess Weight Is For Yo-TeluguStop.com

అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే స్మూతీ సూప‌ర్ గా హెల్ప్ చేస్తుంది.మ‌రి ఆ స్మూతీని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌, నాలుగు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, రెండు క‌ప్పుల‌ వాట‌ర్ వేసుకుని ఓవ‌ర్ నైట్ నాన‌బెట్టుకోవాలి.ఉద‌యాన్నే బ్లెండ‌ర్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న ఓట్స్‌, చియా సీడ్స్‌, ఖ‌ర్జూరాల‌ను వేసుకోవాలి.

వాటితో పాటు వ‌న్ టేబుల్ స్పూన్ పీన‌ట్ బ‌ట‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ స‌త్తు పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కోకో పౌడ‌ర్‌, మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు మ‌రియు ఒక గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ హై ప్రోటీన్ స్మూతీ సిద్ధ‌మైన‌ట్లే.ఈ స్మూతీని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే అతి ఆక‌లి అన్న మాటే అన‌రు.అతి ఆక‌లి త‌గ్గితే చిరు తిండ్లపై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.దాంతో అధిక బ‌రువు స‌మ‌స్య‌ క్ర‌మంగా దూరం అవుతుంది.అలాగే రోజు మార్నింగ్ ఈ స్మూతీని తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, అల‌స‌ట వంటివి ప‌రార్ అవుతాయి.రోజంతా ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా ఉండేందుకు కావాల్సిన శ‌క్తిని సైతం ఈ స్మూతీ ద్వారా పొందొచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube