కిడ్నీలో రాళ్లు( Kidney stones ).ఇటీవల రోజుల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
తగినంత నీరు తాగకపోవడం, మధుమేహం, ఊబకాయం, మాంసాహారం అతిగా తీసుకోవడం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి.కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల యూరినేషన్ సమయంలో మంట, నొప్పి విపరీతంగా వేధిస్తాయి.
అలాగే పొత్తు కడుపులో నుండి భరించలేనంత నొప్పి వస్తుంటుంది.ప్రాథమిక దశలోనే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అలాగే మందుల ద్వారానే కాకుండా కొన్ని కొన్ని ఆహారాలు కూడా కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి.అందులో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కూడా ఒకటి.కిడ్నీలో రాళ్లు ఉన్నవారు రెగ్యులర్ డైట్ లో ఈ జ్యూస్ ను చేర్చుకుంటే చాలా మంచిది.కిడ్నీలో రాళ్లు వేగంగా కరుగుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక యాపిల్( Apple ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తొక్క చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక ఆరెంజ్ పండును( Orange fruit ) తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో గింజ తొలగించిన పుచ్చకాయ ముక్కలు, ఆరెంజ్ పల్ప్, మరియు కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో ఎలాంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదు.
బ్లెండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ ( Lemon )జ్యూస్ మిక్స్ చేసి తీసుకోవాలి.కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఈ పుచ్చకాయ ఆరెంజ్ ఆపిల్ జ్యూస్ నిత్యం తీసుకోవాలి.
ఈ జ్యూస్ కిడ్నీలో రాళ్లను కరిగించడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే కిడ్నీలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలను తొలగిస్తుంది.
మూత్రపిండాలను శుభ్రంగా ఆరోగ్యంగా మారుస్తుంది.అంతేకాదు ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే బాడీ డిటాక్స్ అవుతుంది.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.అనేక సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
మరియు చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.