ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిదో తెలుసా?

హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ప్రతి రోజూ లేదా మనకు నచ్చిన ఏదో ఒక వారం నాడు ఆ దేవుడికి పూజ చేయడం చేస్తుంటాం.అందు లోనూ చాలా మంది ఆలయాలకు వెళ్లి మరీ ఆ భగవంతుడిని దర్శించు కుంటారు.

 Do You Know Which Time Is Better Worship At What Time ,  Benefits Of Worshiping-TeluguStop.com

అయితే ఎక్కువ మంది ఉదయం లేదా సాయంత్రమే గుడికి వెళ్తారు.అందుకు కారణం ఆ సమయాల్లో మాత్రమే ఎక్కువగా గుడులు తెరిచి ఉంటాయి.

మరీ పెద్ద పెద్ద గుడుల్లో అయితే పండుగలు, పబ్బాలప్పుడు లేదా ఆ దేవుడికి సంబంధించిన ప్రత్యేక పూజలప్పుడు మాత్రమే రోజంతా ఆలయం తెరిచి ఉంటుంది.మామూలు సమయాల్లో అయితే చాలా వరకు మధ్యానం మూసేస్తారు.

అయితే ఆంజనేయ స్వామిని దర్శించు కునేందుకు మధ్యాహ్నం 12 గంటల సమసయం మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి.అదేంటి అనుకుంటున్నారా… అవునండి.

ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిదో మన పురాణాలు చెప్పాయి.అయితే అదేంటో మనం కూడా తెలుసుకుందాం.

తెల్లవారు జామున 3 గంటలకు శ్రీ మహా విష్ణువును పూజిస్తే.ఆయన దయ మనపై అపారంగా ఉంటుందట.

ప్రాతఃకాలం సూర్య భగవానుడిని ఉదయం 6 గంటల లోపు పూజించాలి.ఈ సమయంలోని పూజ శ్రీ రామ చంద్రుడికి, వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం.

ఉదయం 6 నుంచి 7 గంటల వరకు పరమ శివుడిని, దుర్గా దేవిని పూజిస్తే మంచి ఫలితం కల్గుతుంది.మధ్యానం 12 గంటలకు ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిదట.

సాయంత్రం 3 గంటలకు రాహువును పూజిస్తే మంచి జరుగుతుంది.సూర్యా స్తమయ సమయాన శివ పూజకు దివ్యమైన సమయం.

రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె చూపెప్పుడూ మనపైనే ఉంటుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube