సాధారణంగా ప్రతి మనిషి జీవితంలోనూ శని ప్రభావం తప్పకుండా ఉంటుంది.అయితే ఒకసారి శని ప్రభావం మనపై ఉందంటే ఏడు సంవత్సరాల పాటు ఉంటుందని చెబుతుంటారు.
ఈ క్రమంలోనే మనం ఏలాంటి పనులు చేసిన ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది.అందుకే ఇలా శని ప్రభావం ఉన్నప్పుడు మనకు దురదృష్టం కూడా వెంటాడుతుంది.
మరి ఈ శని ప్రభావం తొలగిపోవాలంటే చాలామంది ఎన్నో రకాల పరిహారాలను చేస్తుంటారు ఈ క్రమంలోనే శనివారం ఐదు పనులను చేయటం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
శని ప్రభావ దోషం, దురదృష్టం తొలగిపోవాలంటే శనివారం లేదా సోమవారం గంగాజలంతో కడిగిన రుద్రాక్ష మాల ధరించాలి.
ఇలా ధరించడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి.ఇకపోతే పురాణాలలో హనుమంతుడిపై శని ప్రభావం లేదని చెబుతారు అందుకే హనుమంతుడిని పూజించడం వారికి శని ప్రభావ దోషం తొలగిపోతుందని సాక్షాత్తు శనీశ్వరుడు తెలియజేశారని పురాణాలు చెబుతున్నాయి.
కనుక ఏడు శనివారాలు హనుమాన్ చాలీసా సుందరకాండ వంటివి చదవటం వల్ల శని ప్రభావ దోషం పోతుంది.శనివారం రావి చెట్టుకు పూజ చేయడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది.
శనివారం సాయంత్రం ఆవనూనెతో రావి చెట్టు కింద దీపం వెలిగించి పూజ చేయటం వల్ల శనిదోషం తొలగిపోతుంది.
శనివారం రోజు ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 5, 7, 9 ,11 సార్లు చదవాలి.ఇలా చేయడం వల్ల మన పై ఉన్న శని ప్రభావం దోషం తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి దురదృష్టం కూడా ఉండదు.శని ప్రభావ దోషం మనపై తొలగిపోవాలంటే శనివారం నవగ్రహాలను దర్శించిన అనంతరం నల్ల నువ్వులను నల్ల వస్త్రాలను దానం చేయాలి.
అలాగే నీలిరంగు పుష్పాలతో శనీశ్వరుడిని పూజించాలి.