జపస్థలము ఎన్నుకొను విధానము గురించి తెలుపండి?

భగవంతుడిని ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.వాటిలో చాలా ముఖ్యమైనది, అందరూ సులభంగా చేయగల్గేది జపం ఒక్కటే.

 How To Know The Japasthalam , Devotional , How To Do Japam , Japam , Japasthal-TeluguStop.com

అయితే మొక్కుబడిగా, కాలక్షేపానికి కాకుండా ఓ పద్ధతి ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.అయితే జపం చేసేటప్పుడు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ కూర్చొని చేస్తే ఎలాంటి ఫలితాలు కల్గుతాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఉన్నివస్త్రము లేక ఉన్నితివాచీ మీద కూర్చుని జపం చేస్తే వంశవృద్ధి కల్గుతుంది.
2.పర్వశిఖరం మీద కూర్చుని జపం చేస్తే జపం ఇంకా ఇంకా చేయాలన్నతపన కలుగుట మరియు తపస్సిద్ధి కలుగును.
3.పీఠం, ఆశ్రమము, దేవాల యము ఆవరణలలో జపించిన దేవతానుగ్రహము, మంచి కలలు వస్తాయట.
4.ఇంట్లో జపించినట్లు అయితే ఎంత జపం చేస్తే అంత ఫలితమే వస్తుంది.
5.ప్రవహించే జీవ నదిలో నిలబడి బొడ్డుకు జలం తగిలి ఏలాగ జపించిన జప సంఖ్యకు రెండు రెట్లు ఫలితము లభిస్తుంది.
6.గోశాల యందు కూర్చుని జపం చేస్తే జప సంఖ్యకు నూరు రెట్లు ఫలితము కలుగును.
7.యజ్ఞం చేసిన స్థలంలో కూర్చుని జపం చేసిన జప సంఖ్యకు నూరు రెట్లు ఫలితంకలుగును.
8.కాశీలో విశ్వేశ్వరుని దేవాలయము, శ్రీశైల మల్లిఖార్జున దేవాలయము, తిరుమల తిరుపతి వెంకన్న దేవాలయాలు వంటి స్వయంభువుగా వెలసిన దేవాలయాలలో దేవతామూర్తికి
ఎదరుగా లేక ముఖ మండపములలో గాని కూర్చుని మంత్రం జపించిన జప సంఖ్యకు కోటి రెట్లు అధికంగా కలుగును.
9.సూర్యునికి గాని, గురువుకి గాని, దీపానికి గాని అభి ముఖంగా కూర్చుని జపం చేసిన మంత్రము త్వరగా సిద్ధించును.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube