సాయిబాబాను గురువారం ఈ విధంగా పూజిస్తే.. శుభ ఫలితాలను పొందడం ఖాయం..!

మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సాయి బాబాను( Sai Baba ) పూజించే భక్తులు ఎంతో మంది ఉన్నారు.అలాగే బాబా ను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు.

 Worship Sai Baba Like This On Thursday Details, Worship Sai Baba , Thursday, Sai-TeluguStop.com

గురువారం రోజున( Thursday ) ఉపవాసం ఉండి సాయిబాబాను పూజించిన వాళ్లకు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు పుణ్య ఫలం కూడా లభిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే తొమ్మిది గురువారాలు ఉపవాసం( Fasting ) ఉండడం వల్ల మంచి జరుగుతుందని ఎంతో మంది భక్తులు నమ్ముతారు.

గురువారం రోజు తెల్లవారు జామున నిద్ర లేచి ఉపవాసం చేస్తూ సాయి బాబాను పూజించాలి.గురువారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించి బాబాను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Sai Baba, Sai Baba Pooja, Sai Baba Temple, Thursday-L

ఇంకా చెప్పాలంటే బాబా విగ్రహాన్ని గంగా జలంతో శుభ్రం చేసి పూజలో పెట్టి పసుపు రంగు వస్త్రం కప్పి ఉంచడం మంచిది.బాబాను పువ్వులతో అలంకరించి, లడ్డూలను నైవేద్యంగా సమర్పించి పూజించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.అలాగే సాయిబాబా కథ ను వినిపించి ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి.ఇంకా చెప్పాలంటే గురువారం రోజున ఉన్న దానిలో కొంత మొత్తాన్ని దానం చేయడం( Donate ) వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.

అలాగే భక్తులు తొమ్మిది గురువారాలు ఉపవాసం చేయడం వల్ల సాయిబాబా అనుగ్రహం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Sai Baba, Sai Baba Pooja, Sai Baba Temple, Thursday-L

అలాగే గురువారం రోజున పేదలకు అన్నదానం చేస్తే ఎంతో మంచిది.అలాగే గురువారం రోజు ఉపవాసం సమయంలో పండ్లు మాత్రమే తీసుకొని భగవంతుని పూజిస్తే పుణ్యము లభిస్తుంది.అంతే కాకుండా సాయిబాబా ముందు దీపం వెలిగించి దేవాలయానికి వెళ్లి( Saibaba Temple ) ఒక్కసారి అయినా భోజనం చేయడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి.

సాయిబాబా కు కిచిడి, పసుపు రంగు మిఠాయిలు సమర్పించి పూజించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.ఉపవాసం చేసిన రోజున పండ్లు తీసుకోవడంతో పాటు ఒక పూట భోజనం చేయాలి.

సాయిబాబా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి సంతోషాన్ని కోరుకుంటాడని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube