హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని కష్టాల నుంచి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు.మనం జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా భక్తి విశ్వాసంతో హనుమంతుని పూజిస్తే ఆ భక్తులను రక్షిస్తాడని వారి నమ్మకం.
హనుమంతుడి జయంతినీ భక్తులు పవిత్రంగా జరుపుకుంటారు.చైత్రమాసం పౌర్ణమి తిది రోజున హనుమంతుడి పూజ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
హనుమాన్ ఆరాధనతో ముడిపడి ఉన్న ఈ పండుగలో ఆంజనేయ మంత్రాలను పటించడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
రామ భక్తుడు హనుమాన్ నుంచి కోరుకున్న వరాన్ని పొందగల అద్భుతమైన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమాన్ జయంతి రోజున భక్తుల కష్టాలు తీర్చమని సరళ మంత్రమైనా ఓం శ్రీ హనుమతే నమః’ లేదా ‘ఓం హనుమతే నమః’ అనే మంత్రాన్ని పూర్తి భక్తి విశ్వాసంతో జపించాలి.ఈ మంత్రాన్ని పాటించడం ద్వారా భక్తుల కష్టాలన్నీటిని హనుమంతుడు దూరం చేస్తాడని వేద పండితులు చెబుతున్నారు.
ఈ మంత్రానికి చాలా శక్తి ఉందని భక్తులు నమ్ముతారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఎవరి జీవితంలోనైనా తెలియని శత్రువులతో ప్రమాదం ఉంటే లేదా ఏదైనా ప్రాణాంతక వ్యాధి కారణంగా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే వీటన్నింటి నుండి బయట పడాలంటే హనుమాన్ జయంతి రోజు ఈ మంత్రాన్ని పూర్తి భక్తితో జపించాలి.హనుమంతుడి జయంతి రోజు( Hanuman Jayanti ) మంత్రాన్ని ఎలా జపించాలంటే పూజ సమయంలో మహా మంత్రాన్ని జపించడానికి సాధకుడు ముందు ఎరుపు రంగు ఉన్ని ఆసనంపై కూర్చోవాలి.
దీని తర్వాత ఆంజనేయుడి చిత్రం లేదా విగ్రహం ముందు స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని( Ghee lamp ) వెలిగించి నియమా నిబంధనల ప్రకారం పూజించాలి.ఆ తర్వాత కోరికను స్వామివారికి తెలియజేసి రుద్రాక్ష లేదా పగడపు పూసలతో బజరంగీ మంత్రాన్ని జపించాలి.ఈ మంత్రాలను జపిస్తున్నప్పుడు ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి.
ముఖ్యంగా చెప్పాలంటే మంత్రాన్ని పఠించడం ద్వారా బజరంగబలి అనుగ్రహాన్ని పొందాలంటే సాధకుడు పొరపాటున కూడా మనసులో చెడు ఆలోచనలు చేయకూడదు.ముఖ్యంగా కోపం తెచ్చుకోకూడదు.
DEVOTIONAL