నేషనల్ క్రష్ రష్మిక ( Rashmika )లీడ్ రోల్ లో రెయిన్ బో అనే సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.శాంతారుబన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డ్రీం వారియర్ పిక్చర్స్( Dream Warrior Pictures ) నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు రెయిన్ బో అన్న టైటిల్ ఎందుకు పెట్టారో కానీ ఆల్రెడీ ఇదే టైటిల్ తో తెలుగులో ఒక సినిమా వచ్చి డిజాస్టర్ అయ్యింది.వి.ఎన్ ఆదిత్య డైరెక్షన్ లో హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ కలిసి రెయిన్ బో అనే సినిమా చేశారు.
2008లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.అయితే ఆ సినిమా టైటిల్ ను ఇప్పుడు రష్మిక సినిమాకు పెట్టారు.అఫ్కోర్స్ అసలు రాహుల్ రెయిన్ బో ఎవరికీ అంతగా గుర్తు ఉండే ఛాన్స్ లేదు.
రష్మిక సినిమాకు రెయిన్ బో ( Rain bow )పర్ఫెక్ట్ టైటిల్ అని తెలుతుంది.నేషనల్ క్రష్ గా మారిన రష్మిక కెరీర్ లో ఫస్ట్ టైం ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తుంది.
ఈ సినిమాతో ఆమె అసలు స్టామినా ఏంటన్నది తెలుస్తుంది.అనుష్క, సమంత బాటలో రష్మిక సోలోగా సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాలి.