ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.03
సూర్యాస్తమయం: సాయంత్రం.6.37
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.8.00 ల10.30 సా4.00 ల6.00
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12
మేషం:
ఈరోజు మీరు ఆటంకాలు ఎదురైన చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.అనుకున్న సమయంలో పనులు పూర్తి కావాలంటే అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది.భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభం:
ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది.దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
మిథునం:
ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు.బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.అవసరానికి తగిన సహాయం అందుతుంది.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ఆర్థికంగా లాభాలు అందుకోవడానికి ప్రయత్నిస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
సింహం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.
మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని కోరుకుంటారు.ఇతరులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.
కన్య:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కొందరు వ్యక్తులను కలవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.
తుల:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
ధనుస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.
దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మకరం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.వీటి వల్ల భవిష్యత్తులో లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో ఎక్కువగా చర్చలు చేసే అవకాశం ఉంది.
కుంభం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు చేస్తారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఇతరులకు మీకు తోచినంత సహాయం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
.