డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వారిని, నేరస్తులను అమెరికా నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.ట్రంప్ బాటలోనే పలు దేశాల ప్రభుత్వాలు కూడా అక్రమ వలసదారులపై దృష్టి సారించాయి.
ఇలాంటి పరిస్ధితుల్లో కెనడా ప్రభుత్వం( Canada Government ) శుభవార్త చెప్పింది.స్టూడెంట్ వర్క్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌డబ్ల్యూపీపీ)( Student Work Placement Program ) కింద అదనంగా 40 వేల అవకాశాలను ప్రకటించడం ద్వారా కెనడా విద్యార్ధులను వర్క్ ప్లేస్‌మెంట్‌లతో అనుసంధానించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొంది.2024 బడ్జెట్‌లో 207.6 మిలియన్ డాలర్ల మద్ధతుతో ఈ చొరవ తీసుకున్నారు.వివిధ పరిశ్రమలలో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్( Work-Integrated Learning ) అవకాశాలను అందించడం ద్వారా పోస్ట్ సెకండరీ విద్యార్ధులు వర్క్‌ఫోర్స్‌లోకి మారడానికి వీలు కుదురుతుంది.

కెనడా జాబ్స్ అండ్ ఫ్యామిలీస్ మంత్రి స్టీవెన్ మెకిన్నన్( Minister Steven MacKinnon ) దీనికి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు.విద్యార్ధులను ఉపాధికి సిద్ధం చేయడంలో ఆచరణాత్మక శిక్షణ ప్రాధాన్యతను ఆయన హైలైట్ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు తమ అధ్యయనాలకు అనుగుణంగా పని అనుభవాన్ని పొందొచ్చు.
తద్వారా వారు లేబర్ మార్కెట్‌కు సంబంధించిన నైపుణ్యాలను పొందుతారని స్టీవెన్ అన్నారు.ఈ ఎస్‌డబ్ల్యూపీపీ కో ఆప్ ప్రోగ్రామ్‌లు, చెల్లింపు ఇంటర్న్‌షిప్‌లు, హ్యాకథాన్‌లు, వర్చువల్ ప్లేస్‌మెంట్‌లు, మైక్రో ఇంటర్న్‌షిప్‌లను అందిస్తుందన్నారు.

ప్రభుత్వం పెట్టే పెట్టుబడి.ఈ ఉద్యోగ నియామకాలను సులభతరం చేసే సంస్థలకు మద్ధతును ఇస్తుంది.విభిన్న విద్యా నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్ధులు ఉపాధి సంబంధిత శిక్షణను పొందగలరని నిర్ధారిస్తుంది.ఇది బహుళ రంగాలో కెనడా ఎదుర్కొంటున్న కార్మిక కొరతను పరిష్కరించడానికి సహాయపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2017లో ప్రారంభించిన నాటి నుంచి ఎస్‌డబ్ల్యూపీపీ 2,49,000కు పైగా వర్క్ ఇంటిగ్రెటేడ్ లెర్నింగ్ అవకాశాలను అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.2023-24లోనే 57 వేలకు పైగా నియామకాలకు నిధులు సమకూర్చింది ప్రభుత్వం.ఈ కార్యక్రమం కెనడాలోని దాదాపు 87 శాతం మంది పోస్ట్ సెకండరీ సంస్ధలలోని విద్యార్థులను చేరుకుంది.