సూర్యాపేట జిల్లా:దేశం మొత్తం ఉగాది పర్వదినం జరుపుకుంటున్న వేళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను,కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పెరుమళ్ళ సతీష్ అన్నారు.ఆదివారం హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తెల్లవారుజామున పాలకవీడు పోలీసులు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి వచ్చి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ముందస్తు అరెస్టుల పేరుతో ఉగాది పండుగ రోజు నిర్బంధించడం దుర్మార్గపు చర్యన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని ఎక్కడ అడ్డుకుంటారోననే భయంతో పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోరాడుతూనే ఉంటారని తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో బాబు,రమేష్,రాజశేఖర్,నాగేష్, వెంకన్న,వీరబాబు,హరి,కోటేష్ తదితరులు ఉన్నారు.







