ఈ మధ్యకాలంలో చాలామందికి గ్యాస్ అలాగే ఎసిడిటీ( Gas Acidity ) లాంటి జీవన సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్యాస్ సమస్య బారిన పడుతున్నారు.
అయితే మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల అలాగే ఒత్తిడి వ్యాయామం చేయకపోవడం వలన ఇలా జరుగుతుంది.ఇక జంక్ ఫుడ్ ను( Junk Food ) ఎక్కువగా తీసుకోవడం వలన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వలన ఇలా జరుగుతుంది.
అంతేకాకుండా తరచూ ఆహారాన్ని తీసుకోవడం, మలబద్ధకం, ఆమ్లత్వం లాంటి ఆహారాన్ని తీసుకోవడం వలన కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.అయితే గ్యాస్, ఎసిడిటీ సమస్య తలెత్తగానే చాలామంది మందులను, గ్యాస్ సిరప్లను తాగుతూ ఉంటారు.
వీటి వలన తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.అంతేకానీ వీటిని ఎక్కువగా వాడడం వలన దుష్ప్రభావాలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
అందుకే సహజసిద్ధ చిట్కాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయట పడేందుకు ప్రయత్నించాలి.
అయితే ఈ సమస్యను తగ్గించడంలో పాలు, నెయ్యి( Milk Ghee ) చాలా ఉపయోగపడతాయి.అయితే నీటిలో 20 ఎంఎల్ కాల్చి చల్లార్చిన పాలు, ఒక టీస్పూన్ ఆవు నెయ్యి వేసి కలిపి తాగాలి.ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
నెయ్యి తినే అలవాటు లేని వారు రాత్రి చల్లటి పాలను తాగాలి.ఇలా చేస్తే ఎసిడిటి సమస్య తగ్గుతుంది.
అలాగే పసుపు, నల్ల ఉప్పు, జీలకర్ర, నిమ్మకాయతో పొడిని తయారు చేసుకోవాలి.
ఈ చిట్కాను వాడడం వలన కడుపులో మంట, కడుపుబ్బరం, కడుపునొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి.అంతేకాకుండా మజ్జిగను తాగడం వలన కూడా మనకు ఎసిడిటీ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.దీనికోసం ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు, పావు టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి బాగా కలిపి తాగాలి.
ఇలా ఈ చిట్కాలను పాటిస్తే ఎలాంటి గ్యాస్ సమస్య అయినా దూరం అవుతుంది.