మహేష్( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబో మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా గురించి మహేష్ బాబు కూతురు సితార( Sitara ) రియాక్ట్ కాగా సితార చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సితార ప్రస్తుతం పలు ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా తాజాగా ఆమె చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
మహేష్ రాజమౌళి కాంబో మూవీలో నాన్న లుక్ అదిరిపోతుందని సితార అన్నారు.
మీరు ఊహించిన దానిని మించే విధంగా ఈ సినిమా ఉంటుందని సితార చెప్పుకొచ్చారు.ఇంతకు మించి ఈ సినిమా గురించి నేనేం చెప్పలేనని సితార కామెంట్లు చేయడం గమనార్హం.
సితార కామెంట్లు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) హీరోయిన్ గా ఎంపికయ్యారు.పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaaran ) ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు.మహేష్ జక్కన్న కాంబో మూవీ ఎన్ని భాషల్లో విడుదలవుతుందో చూడాల్సి ఉంది.
మహేష్ కు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు నటించే సినిమా ఏదనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.మహేష్ జక్కన్న కాంబో మూవీలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా 2027లో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.
మహేష్ జక్కన్న కాంబో మూవీ బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.