హీరోల పిల్లలు హీరోలుగా.హీరోయిన్ల పిల్లలు హీరోయిన్లుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.మరి తెరవెనుక ఉండి వీరిని స్టార్లుగా తీర్చిదిద్దుతున్న డైరెక్టర్ల పిల్లలు ఏం చేస్తున్నారు? వారిలో ఎవరైనా సినిమాల్లోకి వచ్చారా? లేక విదేశాల్లో చదువుకుంటున్నారా? ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లకు పిల్లలు ఎంత మంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం!
రాజమౌళి:

ఈయనకు ఇద్దరు పిల్లలు.ఒకరు కార్తికేయ, మరొకరు మయూఖ.కార్తికేయ తండ్రి బాటలో సినిమాల్లో అడుగుపెట్టాడు.కూతురు మయూఖ చదువుకుంటుంది.బాహుబలి సినిమాలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది.
పూరీ జగన్నాథ్:

ఈయనకు ఇద్దరు పిల్లలు.కొడుకు ఆకాశ్, కూతురు పవిత్ర.బుజ్జిగాడు సినిమాలో ఈ ఇద్దరు పిల్లలు నటించారు.
చిన్నప్పటి త్రిషగా పవిత్ర, చిన్నప్పటి ప్రభాస్‍గా ఆకాశ్ చేశాడు.ఆ తర్వాత కొడుకు హీరోగా పరిచయం అయ్యాడు.అమ్మాయి తండ్రిబాటలో నడవాలనుకుంటుంది.
సుకుమార్:

ఈయనకు ఇద్దరు పిల్లలు.సుక్రాంత్, సుకృతి.ఇద్దరూ చిన్నపిల్లలు.
మంచి సింగర్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.సుకృతి తన పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ రన్ చేస్తుంది.
తేజ:

డైరెక్టర్ తేజకు ముగ్గురు పిల్లలు.చిన్న కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు.పెద్దకొడుకు అమితోవ్ చిత్రం సినిమాలో నాలుగేళ్లకే నటించాడు.తనని హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.కూతురు అమెరికాలో మాస్టర్స్ చదువుతోంది.
గుణశేఖర్:

ఈయనకు ఇద్దరు బిడ్డలు.నీలిమ, యుక్త.పెద్ద కూతురు నీలిమ రుద్రమ దేవి సినిమాకు నిర్మాతగా చేసింది.చిన్న కూతురు సినిమా మేకింగ్‍లో శిక్షణ తీసుకుంటుంది.
వంశీ పైడిపల్లి:

ఈయనకు ఒక కూతురు.పేరు ఆధ్య.మహేష్ కూతురు సితార, ఆధ్య మంచి ఫ్రెండ్స్.
ఇద్దరు కలిసి ఓ యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారు.ఈ ఇద్దరు పిల్లలు మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేశారు.
మారుతి:

ఈయనకు ఇద్దరు పిల్లలు.అభిష్టా, ఆశ్రీశ్.ప్రతిరోజు పండగే సినిమాలో తన కూతురు అభిష్టాను పరిచయం చేశాడు.ఓ బావా మా అక్కను సక్కగ చూస్తావా అంటూ రాశీ ఖన్నాను ఆటపట్టిచే అమ్మాయి క్యారెక్టర్‍లో అభిఫ్టా చేసింది.