ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) చిన్న కుమారుడు మార్క్ శంకర్( Mark Shankar ) ప్రమాదం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన ప్రమాదంలో పిల్లడు గాయపడగా.
వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యులు బ్రోన్కో స్కోపీ అనే చికిత్స అందించారు.ఈ చికిత్స ద్వారా పిల్లాడిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు.
అంతేకాకుండా ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయని.నల్లటి పొగ పీల్చినట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయాన్ని పంచుకున్నారు.

అయితే, మార్క్ శంకర్ కోలుకోవడంలో తల్లి అన్నా లెజ్నెవా( Anna Lezhneva ) ఎంతో భావోద్వేగంతో తల నీలాలు తియించి తిరుమల శ్రీవారికి సమర్పించారు.ఈ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొడుకు ఆరోగ్యంగా ఉండాలని తల్లి చేసిన ఈ పనితో మెగా అభిమానులు మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అన్నాను ప్రశంసిస్తున్నారు.

ఇకపోతే, అన్నా లెజ్నెవా తన కుమారుడి పేరుతో తిరుపతిలోని టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కి ( TTD Annadana Trust in Tirupati )రూ.17 లక్షల విరాళాన్ని ప్రకటించారు.ఈ విరాళంతో శ్రీ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భక్తులకు భోజన సదుపాయం కల్పించారు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.అన్నా లెజ్నెవా స్వయంగా భక్తులకు భోజనం వడ్డించి, ఆ తరువాత స్వయంగా ప్రసాదాన్ని స్వీకరించారు.
ఆమె చేసిన ఈ దాతృత్వం, సేవా భావనపై టీటీడీ అధికారులు ప్రశంసలు కురిపించారు.ఈ సంఘటనలన్నీ మెగా కుటుంబ సభ్యుల ఆత్మీయత, భక్తి సేవా ధర్మాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.