లిమిట్ క్రాస్ .. హెచ్ 2 బీ వీసా దరఖాస్తు విండోను క్లోజ్ చేసిన అమెరికా

2025 ఆర్ధిక సంవత్సరం రెండో అర్ధభాగం ప్రారంభంలో తిరిగొచ్చే కార్మికుల కోసం ఉద్దేశించిన అదనపు 19000 హెచ్ 2 బీ వీసాల( H-2B Visa ) కింద పిటిషన్లు దాఖలు చేయడానికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)( US Citizenship and Immigration Services ) విండోను మూసివేసింది.దరఖాస్తులు ఏప్రిల్ 18 నాటికి పరిమితికి మించి చేరుకున్నాయని ఏజెన్సీ తెలిపింది.

 Us H-2b Visa Cap Hits Limit For Fy25 Early Second Half Details, Us, H-2b Visa Ca-TeluguStop.com

ఈ తేదీ తర్వాత స్వీకరించబడిన ఏవైనా దరఖాస్తులు తిరస్కరించబడతాయని ఏప్రిల్ 24న జారీ చేసిన నోటీసులో యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.

అదనపు వీసాలు ఎఫ్‌వై 2025 హెచ్ 2 బీ సప్లిమెంటల్ క్యాప్( FY 2025 H-2B Supplemental Cap ) తాత్కాలిక తుది నియమం ప్రకారం జారీ చేయబడ్డాయి.

ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ప్రారంభ తేదీలలో తిరిగి వచ్చే కార్మికులు యునైటెడ్ స్టేట్స్‌లో( United States ) తాత్కాలిక వ్యవసాయేతర ఉద్యోగాలను చేపట్టడానికి వీలు కల్పిస్తుంది.ఆతిథ్యం, నిర్మాణం, నిర్వహణ వంటి రంగాల కార్మికులకు వీటిని ఎక్కువగా కేటాయిస్తారు.

Telugu Fy Cap, Fy, Visa Cap, Visas, Citizenship, Employers, Uscis-Telugu NRI

తిరిగి వచ్చే కార్మికులకు 19 వేల వీసాల పరిమితి ముగిసినప్పటికీ ఎల్ సాల్వడర్, గ్వాటెమాల , హోండురాస్, హైతీ, కొలంబియా, ఈక్వెడార్, కొస్టారికా జాతీయులకు 20 వేల హెచ్ 2 బీ వీసాల ప్రత్యేక కోటా అందుబాటులో ఉంది.తిరిగి వచ్చే కార్మికుల మాదిరిగా కాకుండా.ఈ దేశాలకు చెందిన దరఖాస్తుదారులకు ముందస్తు హెచ్ 2 బీ వీసా హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు.

Telugu Fy Cap, Fy, Visa Cap, Visas, Citizenship, Employers, Uscis-Telugu NRI

అమెరికాలోని యజమానులు స్వల్పకాలిక, వ్యవసాయేతర ఉద్యోగాలకు , సాధారణంగా సీజనల్ లేదా పీక్ లోడ్ ఉద్యోగాలకు విదేశీ పౌరులను నియమించుకోవడానికి హెచ్ 2 బీ వీసా అనుమతిస్తుంది.ఈ కార్యక్రమం వార్షిక పరిమితి 66 వేల వీసాలు. వీటిని ఆర్ధిక సంవత్సరంలో రెండు భాగాలలో సమానంగా విభజించారు.

హెచ్ 2 బీ వీసాపై అమెరికాలో గరిష్టంగా మూడేళ్లు ఉండొచ్చు.గడువు ముగిసిన తర్వాత మరోసారి ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం మూడు నెలలు అమెరికా వెలుపల ఉండాలి.

అయితే భారతీయులు హెచ్ 2 బీ వీసా కార్యక్రమానికి అనర్హులుగా ఉన్నారు.యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఎంపిక చేసిన దేశాల జాబితాలో భారతదేశం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube