ఈ హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను వాడితే ఎంత నల్లగా ఉన్న తెల్లగా మారతారు!

సాధారణంగా చాలా మంది తమ చర్మం తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు.ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

 Using This Home Made Face Cream Will Make The Skin White! Skin White, Skin White-TeluguStop.com

తరచూ ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకుంటారు.అయితే ఫేషియల్, బ్లీచ్ వంటి వాటి వల్ల స్కిన్ టోన్ పెరుగుతుందేమో కానీ చర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.

అందుకే సహజ పద్ధతుల్లోనే చర్మ ఛాయ‌ను పెంచుకునేందుకు ప్రయత్నించాలని బ్యూటీషన్లు చెబుతున్నారు.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ క్రీమ్ అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ క్రీమ్ ను డైలీ వాడితే కనుక ఎంత నల్లగా ఉన్నవారైనా తెల్లగా మారడం ఖాయం.మరి ఇంతకీ ఆ క్రీమ్‌ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత బీట్ రూట్ ను సన్నగా తురుముకుని పెట్టుకోవాలి.

అలాగే రెండు మందారం పువ్వు రేకులు మరియు ఒక గులాబీ పువ్వు రేకులను తుంచి వాటర్‌లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ ను తీసుకుని అందులో బీట్ రూట్ తురుము, మందారం పువ్వు రేకులు, గులాబీ రేకులు మరియు ఒక కప్పు హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత కలర్ చేంజ్ అయిన వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Tips, Face Cream, Homemadeface, Latest, Skin Care, Skin Care Tips, Skin W

ఇప్పుడు ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న బీట్ రూట్‌, మందారం, గులాబీ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తే క్రీమ్‌ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ ను తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఆపై క్రీమ్ ను అప్లై చేసుకుని పడుకోవాలి.ఇలా ప్రతిరోజు చేస్తే మీ చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మెరిసిపోవ‌డం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube