ఇటీవల కాలంలో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.ఐరన్ లోపం కారణంగా తీవ్రమైన అలసట, నీరసం, తలనొప్పి, రక్తహీనత, జుట్టు అధికంగా ఊడటం డ్రై గా మారడం, చర్మం పాలిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఎన్నో సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి.
అందుకే ఐరన్ లోపం నుంచి ఎంత త్వరగా బయట పడితే ఆరోగ్యానికి అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే ఐరన్ లోపాన్ని నివారించడంలో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ స్మూతీ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక చిన్న అరటి పండును తీసుకుని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక కివి పండును తీసుకుని తొక్కను చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇక ఒక కప్పు పైనాపిల్ ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్, కివి పండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు, నాలుగు నుంచి ఐదు పాలకూర ఆకులు, చిటికెడు బ్లాక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు తేనెను మిక్స్ చేస్తే ఐరన్ లోపాన్ని తరిమికొట్టే టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీని మార్నింగ్ టైం లో తీసుకోవాలి.ప్రతిరోజు కనక ఈ స్మూతీని తీసుకుంటే చాలా త్వరగా మరియు వేగంగా ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చు.
రక్తహీనత సమస్య సైతం దూరం అవుతుంది.