బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో పాన్ ఇండియా ఫిల్మ్ అనే ఒక కొత్త ట్రెండ్ తయారైంది.ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా అంటూ దర్శకనిర్మాతలు తెగ హడావిడి చేస్తున్నారు.
కానీ అప్పట్లో తొలి పాన్ ఇండియా ఫిల్మ్ చేసింది.కొంచెం పాన్ ఇండియా స్టార్ డమ్ కి దగ్గరగా వెళ్లిన వ్యక్తి అక్కినేని నాగార్జున.1997లోనే ఇండియాలో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మూవీ చేశాడు.అదే రాక్షసుడు మూవీ.
ఈ సినిమా వచ్చిన సమయంలో సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా అంటూ.దేశం మొత్తం ఇదే పాట పాడింది.అంతేకాదు.క్లీన్ షేవ్ తో జుట్టును ఓరెంజిలో వెనక్కి పెంచి తిరగడం యూత్ తో పెద్ద ఫ్యాషన్ అయ్యింది.
గట్టిగా చేతులు బిగించి నరాలు బయటకు వస్తాయో రావో చెక్ చేసుకునే ట్రెండ్ వచ్చింది.ఇంత సంచనం కలిగించిన ఈ సినిమా రచగన్ పేరుతో తమిళంలో.
రాక్షసుడుగా తెలుగులో వచ్చింది.
ఈ సినిమాలో నాగార్జున హీరో కాగా.
మిస్ వరల్డ్ సుష్మితా సేన్ హీరోయిన్.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
భారీ చిత్రాలను నిర్మించిన కుంజుమన్ ప్రొడ్యూసర్.ఈ సినిమాకు అప్పట్లోనే 18 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు.
రిలీజ్ కు ముందు భారీగా ప్రచారాలు చేశారు.ఏవార్తా పత్రిక చూసినా ఈ సినిమా గురించే రాశారు.
జనాలంతా ఈ సినిమా గురించే మాట్లాడుకున్నారు.

ఈ సినిమా విడుదల కోసం జనాలు ఎదురు చూశారు. థ్రియెటిక్ ట్రయల్ వేయడం ఈ సినిమా నుంచే మొదలైంది.బ్లాస్టులు, కార్ చేజింగులు, బైక్ తో నాగార్జున చేసిన అడ్వెంచర్లుతో కూడిన రెండు నిమిషాల ట్రయలర్ అప్పట్లో సంచలనంగా మారింది.
సినిమా కంటే తొలుత ఈ ట్రయలర్ చూసేందుకే జనాలు ఎగబడి థియేటర్లకు వెళ్లేవారు.

అక్టోబర్ 30, 1997లలో ఈ సినిమా విడుదల అయ్యింది. నాగార్జున కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యింది.తెలుగు, తమిళంలో సినిమా రిలీజ్ అయ్యింది.
సినిమా టికెట్ల కోసం జనాలు కొట్టుకునే వారు.సినిమా బాగానే ఉన్నా కథ దగ్గరే అసలు ప్రాబ్లం వచ్చింది.
ప్రవీణ్ గాంధీ అనే డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.సినిమాను గ్రాఫిక్స్, ఫైట్స్ తో నింపేశాడు.
చేసిన హైప్ ని నిలబెట్టుకోలేకపోయాడు.నాగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
కానీ అప్పట్లో కనీ వినీ ఎరుగని రీతిలో జనాల ముందుకు వచ్చింది ఈ సినిమా.