వెయిట్ లాస్ కు సహాయపడే బెస్ట్ స్మూతీ ఇది.. బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే మరెన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

ప్రస్తుత రోజుల్లో వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది.బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో పాట్లు పడుతుంటారు.

 This Is The Best Smoothie That Helps In Weight Loss And Give  More Benefits! Smo-TeluguStop.com

కఠినమైన డైట్ ఫాలో అవుతుంటారు.అలాగే రోజు చెమ‌ట‌లు చిందేలా వ్యాయామం చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీని చేర్చుకోవాల్సిందే.ఎంతో టేస్టీగా ఉండే ఈ స్మూతీ వేగంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.అలాగే బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీ చేర్చుకుంటే బరువు తగ్గడంతో పాటు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ కు సహాయపడే ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్‌ వేసి వాటర్ పోసి ప‌దిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

అలాగే మరో బౌల్ లో ఐదు ‌ జీడిపప్పులు, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు విత్తనాలు, రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి ప‌దిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

Telugu Grapesoats, Tips, Latest, Smoothie-Telugu Health

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పుచ్చ‌ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్‌ వేసుకోవాలి.అలాగే ఒక కప్పు సీడ్ లెస్‌ బ్లాక్ గ్రేప్స్ ను వేసుకుని ఒక గ్లాస్‌ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుంటే మన స్మూతీ సిద్దమవుతుంది.ఈ స్మూతీ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా ఈ స్మూతీలో వాడిన బ్లాక్ గ్రేప్స్ మరియు ఓట్స్ వెయిట్ లాస్ కు ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.

Telugu Grapesoats, Tips, Latest, Smoothie-Telugu Health

బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.అలాగే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.కంటి చూపు మెరుగ్గా మారుతుంది.

మరియు జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది.చర్మం సైతం కాంతివంతంగా మెరుస్తుంది.

కాబట్టి వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారే కాదు ఎవ్వరైనా ఈ హెల్తీ అండ్ టేస్టీ స్మూతీని డైట్ లో చేర్చుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube