చుండ్రు నివారణకు బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్.. తప్పక ట్రై చెయ్యండి!

చుండ్రు( dandruff ).పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో మందిని అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది.

 This Oil Is The Best Solution For Dandruff Prevention! Dandruff, Dandruff Preven-TeluguStop.com

అందులోనూ ప్రస్తుత చలికాలంలో చుండ్రు మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకునేందుకు రకరకాల షాంపూలు వాడుతుంటారు.

అయినా సరే ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుందా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వకండి.చుండ్రు నివారణకు ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.మరి ఇంతకీ ఆ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Dandruff Oil, Care, Care Tips, Fall, Oil, Healthy, Healthy Scalp, Oildand

ముందుగా ఒక ఉల్లిపాయ( onion ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర గ్లాస్ ఆవ నూనె( Mustard oil ), అర గ్లాస్ కొబ్బరి నూనె వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు రెండు టేబుల్ స్పూన్లు లవంగాలు( cloves ) వేసి చిన్న మంటపై ఉడికించాలి.దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Dandruff Oil, Care, Care Tips, Fall, Oil, Healthy, Healthy Scalp, Oildand

ఆయిల్ పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.చుండ్రు నివారణకు ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను రాసుకుని మరుసటి రోజు యాంటీ డాండ్రఫ్ షాంపూ తో తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే చుండ్రు సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల స్కాల్ప్ ఆరోగ్యంగా మారుతుంది.

హైడ్రేట్ గా ఉంటుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube