మడమ నొప్పి( Heel pain ).ముప్పై పైబడిన చాలా మందిలో కనిపించే కామన్ సమస్య ఇది.
మడమ నొప్పి తీవ్రమైన బాధకు గురి చేస్తుంది.కొందరు మడమ నొప్పి కారణంగా అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
మడమ నొప్పికి ప్రధాన కారణాల్లో పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడటం ఒకటి.అలాగే సరిగ్గా సరిపోని బూట్లు ధరించడం, అధిక శ్రమ, కఠినమైన ఉపరితలాలపై పరిగెత్తడం లేదా నడవటం, ఊబకాయం, హై హీల్స్ ను అధికంగా వినియోగించడం, ఆర్థరైటిస్ ( Arthritis )తదితర కారణాల వల్ల మడమ నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది.
చాలా మంది మడమ నొప్పి నుంచి రిలీఫ్ పొందడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.కానీ అవి తాత్కాలికంగా మాత్రమే పరిష్కారాన్ని అందిస్తాయి.శాశ్వతంగా ఈ సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి.? ఎటువంటి టిప్స్ పాటించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.మడమ నొప్పి తగ్గాలంటే మొదట రెస్ట్ అనేది మీకు చాలా అవసరం.
భారీ బరువులు ఎత్తడం, పరిగెత్తడం, మెట్లు ఎక్కడం, ఎక్కువసేపు నడవటం లేదా నిలబడటం వంటివి మానుకోవాలి.అధిక శ్రమకు దూరంగా ఉండాలి.దాంతో పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది.ఫలితంగా నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
ఆయిల్ మసాజ్ ( Oil massage )మడమ నొప్పికి సహజ నివారణగా పని చేస్తుంది.ప్రతి రోజూ పాదాలను ఆలివ్, కొబ్బరి, లావెండర్ లేదా అల్లం నూనెతో మసాజ్ చేయండి.ఆయిల్ మసాజ్ వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.అలాగే హై హీల్స్ ను ఎవైడ్ చేయాలి.బాగా సరిపోయే మరియు తక్కువ ఎత్తున్న బూట్లు ధరించండి.
మడమ నొప్పిని తగ్గించడంలో ఐస్ ప్యాక్ కూడా సహాయపడుతుంది.ఐస్ ప్యాక్‌ను క్లాత్ లేదా సన్నని టవల్‌తో కప్పి, నొప్పి ఉన్న ప్రదేశంలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి.
రోజుకు రెండుసార్లు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.