సినిమాల్లో హీరోయిన్ కావాలని అందరికి ఉంటుంది కానీ దానికి తగ్గ ఫిటినెస్ కలర్ ఉన్నదా లేదా అనేది మనంతట మనమే చూసుకోవాలి.హీరోయిన్ అంటే ఇప్పుడైతే బికినీ లు , స్కార్టులు వేసుకుంటున్నారు కానీ సావిత్రి గారి టైం లో నిండుగా చీరలు కట్టుకొని హుందా గా ఉండేవారు.
సావిత్రి నల్లగానే ఉండేవారు కానీ హీరోయిన్ గా సినిమాల్లో బాగా రానిచ్చారు అప్పుడు నలుపు , తెలుపు అనేది పెద్ద విషయమే కాదు అభినయం చూపిస్తే చాలు ఒక ప్రియుడు కి ప్రియురాలు గా ఒక భర్తకి భార్యగా జనాలు ఎలా ఉంటారో ఆలా సినిమాల్లో క్యారెక్టర్స్ ని డిజైన్ చేసేవారు దర్శకులు కానీ ఇప్పటి సినిమాల్లో హీరోయిన్స్ స్కీన్ షో కి తప్ప దేనికి పనిచేయట్లేదు.సావిత్రి గారి టైం లో హీరోలకి సమానం గా హీరోయిన్స్ పాత్రలు ఉండేవి ఇప్పుడు హీరోయిన్ రావాలంటే ఒక ఆడి కార్ కావాలి లేదా ఫ్లయిట్ కావాలి ఈ రిచ్ నెస్ సగటు ప్రేక్షకుడికి నచ్చట్లేదు ఎందుకంటే సినిమా చూసే ఆడియన్స్ హీరో క్యారెక్టర్స్ తో తనని తాను పోల్చుకుంటారు.
కాబట్టి వాళ్ళు అంత చేసిన ఆర్టిఫిస్యలు గానే ఉంటుంది, తప్ప రియాలిటీ గా ఉండట్లేదు.
ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎదగాలి అంటే అప్పట్లో అందం పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు హీరోయిన్ గ ఎదగాలి అంటే మాత్రం అభినయం లేకపోయినా అందం ఉంటె చాలు అంటున్నారు.
సావిత్రి గారి తర్వాత అంతటి వైభవాన్ని సంతరించుకున్న హీరోయిన్ లో సౌందర్య గారు ఒకరు హీరోయిన్ గ ఎదగడానికి అందం అవసరం లేదు అని చాటి చెప్పిన హీరోయిన్స్ వీళ్ళు.అప్పట్లో సావిత్రి గారిని నల్లగా ఉన్నారని చాలామంది తనతో అనేవారట అయినా ఆమె అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేవారట సావిత్రి గారు రోజు స్నానం చేసేటపుడు వంటికి పసుపు రాసుకునేవారట సావిత్రి గారి తో నటించిన చాలా మంది ఆర్టిస్ట్స్ కి తన గురించి తన గొప్పతనం గురించి తెలుసు ఆవిడా చాలామంది కి హెల్ప్ చేసింది తన నుంచి ప్రయోజనం పొందినవారే చివరికి తనని మోసం చేసారు ఎవర్ని అయితే నమ్మిందో వాళ్లే దారుణం గా మోసం చేసారు సినిమా జీవితం లో గొప్ప గా గెలిచినా సావిత్రి గారు జనాల హృదయాల్లో గొప్పగా నిలిచిపోయారు.
![Telugu Gemini Ganeshan, Nature, Mahanati, Rajnikanth, Savitri, Savitri Secret, S Telugu Gemini Ganeshan, Nature, Mahanati, Rajnikanth, Savitri, Savitri Secret, S](https://telugustop.com/wp-content/uploads/2021/02/savitri-never-revealed-about-the-her-beauty-secret.jpg )
సావిత్రి పాతాళ భైరవి , దొంగ రాముడు సినిమా లో నటించినప్పటికీ మాయ బజార్ మూవీ తనకి ఎనలేని కీర్తి తీసుకువచ్చింది.సావిత్రి 1960 లో చిన్నారి పాపాలు అనే సినిమాని డైరెక్ట్ చేసింది దింట్లో దక్షిణ భారతదేశం లోనే మొదటి సరిగా అందరు ఆడవాళ్ళతో చేసిన మూవీ ఇది.సావిత్రి గారు చేసిన సేవకిగాను ఆమె కి తమిళనాడు గవర్నమెంట్ మహానటి అనే బిరుదు ఇచ్చి సత్కరించింది…తాను తర్వాత జెమిని గణేశన్ ని పెళ్లి చేసుకొని ఒక పాపా కి జన్మనిచ్చింది.
హీరోయిన్ అంటే సావిత్రి ల ఉండాలిరా అని ఇప్పటికి చాల మంది అంటారు అలంటి అభినయాన్ని చూపే హీరోయిన్స్ కావాలి అందాన్ని చూపిస్తూ అసభ్యంగా కనిపించే హీరోయిన్స్ కాదని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వెండితెర పై వెలుగు వెలగడానికి పొడుగు, పొట్టి, దొడ్డు, సన్నం, తెలుపు, నలుపు పెద్ద విషయం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి.ఇది హీరోయిన్స్ విషయం లోనే కాదు హీరోల విషయం లో కూడా చెప్పుకోవచ్చు.
వైట్ గా ఉన్న వల్లే హీరో అవుతారు అంటే రజిని కాంత్ అసలు హీరో నే అయ్యేవాడు కాదు కానీ సూపర్ స్టార్ అయ్యాడు.హైట్ ఉన్నవాడు మాత్రమే హీరో అవుతాడు అంటే సూర్య హైట్ చాల తక్కువ సూర్య హీరో అయ్యాడు కదా ఇది మనం కస్టపడి మన పని మనం చక్కగా చేసుకుంటు వెళితే అన్ని పనులు అవే జరుగుతాయి.