ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో చాలామంది దర్శకులు మంచి విజయాలను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్బంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు.
ఇక చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి విజయాలను సాధించి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్లలో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)ఒకరు.
ఆయన బాలీవుడ్లో సైతం డైరెక్ట్ గా సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించారు.
అలాగే బాలీవుడ్ మాఫియా కి సైతం ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూ వస్తున్నారు.ఆయన చేసిన సినిమాల మీద భారీ విమర్శలు చేసినప్పటికి ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా వాళ్లకు తగ్గ సమాధానం అయితే చెబుతూ వస్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన టాప్ డైరెక్టర్ గాఎదిగాడు.తద్వారా ఇప్పుడు ప్రభాస్ (Pradhas)తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.తను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.

ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న సినిమాలలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడమే కాకుండా ప్రభాస్ లాంటి నటుడిని మనం ఇప్పటివరకు ఇంకొకరిని చూడలేదు అనేంతలా అతనికి పేరు తీసుకొచ్చే విధంగా ఈ పాత్ర అయితే ఉండబోతుందట.మరి సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy)యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా అద్భుతంగా తరికెక్కిస్తూ ఉంటాడు.ఈ సినిమాలో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఐతే ఉన్నాయని సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలయితే వస్తున్నాయి.
మరి ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)మరోసారి భారీ విజయనందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…