ఎవరి జీవితాలు వారివే... బ్రేకప్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన నిఖిల్...పోస్ట్ వైరల్! 

బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బుల్లితెర నటీనటులు నిఖిల్(Nikhil) కావ్య (Kavya)జంట ఒకటి.వీరిద్దరి గోరింటాకు సీరియల్ ద్వారా పరిచయమయ్యారు.

 Serial Actor Nikhil Post Goes Viral On His Breakup With Kavya, Kavya, Nikhil, Bi-TeluguStop.com

ఈ సీరియల్ తో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.వీరి ప్రేమ విషయాన్ని పలు సందర్భాలలో పరోక్షంగా తెలియజేశారుగా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఏ కార్యక్రమానికి వెళ్లిన నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి వెళ్లేవారు.

అయితే కొన్ని కారణాలవల్ల ఇద్దరు పెద్ద గ్యాప్ ఏర్పడిందని తెలుస్తోంది.

ఈ క్రమంలోని వీరిద్దరూ బ్రేకప్(Break Up) చెప్పుకున్నారని అయితే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించలేదంటూ వార్తలు వినిపించాయి గురించి బిగ్ బాస్(Bigg Boss) లోకి వెళ్లిన నిఖిల్ అక్కడ తన బ్రేకప్ గురించి చెప్పడమే కాకుండా, బయటకు వెళ్ళగానే ఆ అమ్మాయికి క్షమాపణలు చెబుతాను అంటూ పరోక్షంగా కావ్య గురించే మాట్లాడారు.దీనితో వీరిద్దరూ కలిసిపోతారని అందరూ భావించారు.

ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి.వీరి ఫ్యాన్స్ ఈ ఇద్దర్ని ట్యాగ్ చేస్తూ పలు పోస్టులు పెడుతుండటంతో నిఖిల్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Telugu Bigg Boss, Break, Kavya, Nikhil, Serial Nikhil-Telugu Top Posts

మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు మీ అందరి సపోర్ట్ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను.కానీ నాదొక రిక్వెస్ట్.ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నాము.కాబట్టి మమ్మల్ని వ్యక్తిగతంగానే సపోర్ట్ చేయండి, ప్రేమించండి.నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

మీ అందరిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను.మీరు ఎవరితోనో నన్ను ట్యాగ్ చేయొద్దు … పరిస్థితులను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది అయితే కచ్చితంగా కావ్య గురించి ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని భావిస్తున్నారు.

మరి ఈ పోస్ట్ పై కావ్య స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube