కొత్త 'అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ' ఫీచర్ ను తీసుకొచ్చిన వాట్సాప్!

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్ తరచూ కొత్త ఫీచర్లు అందిస్తూ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తోంది.ముఖ్యంగా ప్రైవసీ పరంగా మరింత భద్రత కల్పించే దిశగా అడుగులు వేస్తోంది.

 Whatsapp Introduces New 'advanced Chat Privacy' Feature, Whatsapp, Advanced Chat-TeluguStop.com

తాజాగా, వాట్సాప్ ‘అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ’ (Advanced Chat Privacy) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.ఈ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే, వ్యక్తిగతంగా లేదా గ్రూప్ చాట్‌లో ఉన్న మీ సంభాషణల భద్రత మరింత పెరుగుతుంది.దీని వలన మీ చాట్‌లలోని వ్యక్తిగత విషయాలు ఇతరులకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి.

ముఖ్యంగా గ్రూపుల్లో అన్ని రకాలవారితో చాటింగ్ జరుగుతున్నప్పుడు, ఈ ఫీచర్ ఎంతో అవసరం అవుతుంది.

ఈ డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారం రక్షించుకోవడం ఎంతో అవసరం.

ఆరోగ్య సంబంధిత సమాచారం,( Health related information ) కుటుంబ సంబంధమైన చర్చలు, పొలిటికల్ లేదా సామాజిక చర్చలు వంటి సున్నితమైన విషయాలు ఎవరూ తెలుసుకోకుండా ఉంచాలంటే, ఈ ఫీచర్ వాడటమే ఉత్తమ మార్గం.ఉదాహరణకు, ఫ్రెండ్స్ గ్రూపులు, ఇంకా వేరే వర్క్ సంబంధిత విషయాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

అదనంగా, మీడియా ఫైళ్లను ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయకుండా ఆపడం వల్ల ఫోన్ స్టోరేజ్ కూడా ఆదా అవుతుంది.

Telugu Advancedchat, Chat, Chat Security, Security, App, Privacy, Tech, Whatsapp

మరి దీనిని ఎలా యాక్టివేట్ చేయాలంటే.మీరు ఈ ఫీచర్ వాడాలనుకునే చాట్ ఓపెన్ చేయండి.చాట్ టాప్‌లో కనిపించే పేరు మీద ట్యాప్ చేయండి.

అలా స్క్రోల్ చేస్తే “Advanced Chat Privacy” అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిని ట్యాప్ చేసి స్విచ్ ఆన్ చేయండి.

ఇంత సులభంగా మీరు మీకు అవసరమైన ప్రతి చాట్‌కు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్ లేటెస్ట్ వాట్సాప్ వర్షన్ వాడుతున్న అందరికీ లభిస్తోంది.

మీరు ఈ ఫీచర్‌ను వినియోగించాలంటే, ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌కి వెళ్లి మీ యాప్‌ను అప్‌డేట్ చేయాలి.వాట్సాప్ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం, ఇది కేవలం ఆరంభం మాత్రమే.

భవిష్యత్తులో ఇంకా అధునాతన ప్రైవసీ ఆప్షన్లను తీసుకురానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube