న్యాచురల్ స్టార్ నాని( Nani ) హిట్3( Hit 3 ) సినిమాతో మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో రివ్యూల గురించి జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నాని తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఆడియన్స్ ఒక సినిమా చూడట్లేదంటే అది ప్రేక్షకుల తప్పు ఏ మాత్రం కాదని నాని వెల్లడించారు.
ఇది పూర్తిగా మేకర్స్ వైఫల్యం అని నాని పేర్కొన్నారు.
మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారని నాని వెల్లడించడం గమనార్హం.ప్రేక్షకులు ఈ మధ్య థియేటర్లకు రావడం లేదని ఎవరైనా చెబితే నాకు కోపం వస్తుందని నాని పేర్కొన్నారు.
ఆ తప్పు వాళ్లది కాదని సినిమా బాగుందంటే ఎవరైనా ఇంట్లో కూర్చుంటారా? అని నాని ప్రశ్నించడం గమనార్హం.

న్యాచురల్ స్టార్ నాని సినిమా బాగా తీయడం మేకర్స్ బాధ్యత అని చెబుతున్నారు.ఆ పని చేయకుండా ఎన్ని కారణాలు పైకి చెప్పినా ఫలితం ఉండదని నాని చెప్పుకొచ్చారు.నాని కామెంట్లను ఇతర హీరోలు, ఇతర దర్శక నిర్మాతలు అర్థం చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
న్యాచురల్ స్టార్ నాని రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

న్యాచురల్ స్టార్ నానిని అభిమానించే ఫ్యాన్స్ సైతం భారీ సంఖ్యలో ఉన్నారు.హిట్3 సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.హిట్3 సినిమాకు ఒకింత భారీ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.నాని రెమ్యునరేషన్( Nani Remuneration ) ప్రస్తుతం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.నానిని అభిమానించే ఫ్యాన్స్ సైతం లక్షల సంఖ్యలో ఉన్నారు.